BJP leader Chittibabu: తెలంగాణ రాజకీయాల్లో ప్రస్తుతం బిఆర్ఎస్ పార్టీ అలానే బీజేపీ రెండు నువ్వా నేనా అన్నట్లుగా వ్యవహారిస్తున్నాయి. పొలిటికల్ హీట్ ను పెంచుతూ తాజాగా బండి సంజయ్ అరెస్టు రాష్ట్రవ్యాప్తంగా కాక పుట్టించింది. నిజానికి రేపో మాపో కెసిఆర్ కూతురు ఎమ్మెల్సి కవితక్క అరెస్టు అంటూ బాగా చర్చలు జరిగినా చివరికి బీజేపీ రాష్ట్ర నాయకుడు బండి సంజయ్ ను ఉన్నపళంగా అరెస్టు చేయడంతో ఇప్పుడు ఈ ఇష్యూ హాట్ టాపిక్ గా మారింది. ఇక ఇదే విషయం గురించి సీనియర్ ప్రొడ్యూసర్ అలాగే బీజేపీ లీడర్ చిట్టిబాబు మాట్లాడారు.
తెలంగాణలో కెసిఆర్ అధికార దుర్వినియోగం చేస్తున్నారు…
కవిత లిక్కర్ స్కాంలో సీబీఐ విచారణ ఎదుర్కోవడం అందులో ఇప్పటికే విచారణకు హాజరవడం జరిగింది. దీంతో ఈ విషయాన్ని అస్త్రంగా తెలంగాణలో ప్రతిపక్షాలు వాడుతూ కవిత జైలుకి పోతుందని ప్రచారం చేస్తున్నారు. ఇదిలా ఉంటే ఇంతలో పేపర్ లీకేజి వ్యవహారం బయటపడటం అందులో ఇప్పటికే కొంతమంది విచారణ ఎదుర్కోంటుండగా అనూహ్యంగా ఇందులోకి బీజేపీ తెలంగాణ రాష్ట్ర నాయకుడు బండి సంజయ్ పేరు రావడం రాత్రికి రాత్రే అరెస్టు చేయడం జరిగింది.
అయితే ఈ విషయం గురించి చిట్టిబాబు మాట్లాడుతూ అరెస్టు అయి కొన్ని గంటలు దాటతున్నా ఏ సెక్షన్స్ కింద ఆరెస్టు చేసారు, ఏ పోలీస్ స్టేషన్ కి తరలిస్తున్నారు వంటి విషయాలను చెప్పలేదు. కావాలని కక్ష్య పూరితంగా వ్యవహరిస్తోంది బిఆర్ఎస్ ప్రభుత్వం అంటూ తెలిపారు చిట్టిబాబు. వినశాకాలే విపరీత బుద్ధి అని బిఆర్ఎస్ పార్టీ వాళ్ళ అరాచకాలే ప్రజలు వారికి బుద్ధి చెప్పేలా చేస్తాయని తెలిపారు. ఇప్పటికే బీజేపీ శ్రేణులు ఆందోళన చేస్తున్నట్లు చెప్పారు. మొదట లిక్కర్ స్కాంలో ఉన్న కూతురిని వదిలేసి బండి సంజయ్ ను అరెస్టు చేయడం కేవలం విషయాన్ని పక్కకు మల్లించడానికే అంటూ తెలిపారు.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…