Samantha: టాలీవుడ్ ఇండస్ట్రీలో హీరోయిన్ గా ఎంతో పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్న సమంత వరుస సినిమా షూటింగ్ పనులతో బిజీగా ఉన్నారు. ఇలా ఈమె ఒక వైపు సినిమాలు మరోవైపు వెబ్ సిరీస్ లలో నటిస్తూ బిజీగా మారిపోయారు. ఇక ఈమె నటించిన శాకుంతలం సినిమా కూడా విడుదలకు సిద్ధమవుతోంది.
ఈ సినిమా ఏప్రిల్ 14వ తేదీ విడుదల కానున్న నేపథ్యంలో పెద్ద ఎత్తున ప్రమోషన్ కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు.
ఈ సినిమా ప్రమోషన్ కార్యక్రమాలలో భాగంగా చిత్ర బృందం మొత్తం పలు ప్రాంతాలలో పెద్ద ఎత్తున ఇంటర్వ్యూలకు హాజరవుతూ సినిమాని ప్రమోట్ చేస్తున్నారు.ఈ సినిమా పాన్ ఇండియా స్థాయిలో విడుదల కానున్న నేపథ్యంలో సమంత ముంబైలో ఈ సినిమా ప్రమోషన్ కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు.ఈ సందర్భంగా ముంబైలో ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్నటువంటి ఈమె సౌత్ నార్త్ సినీ ఇండస్ట్రీ గురించి సంచలన వ్యాఖ్యలు చేశారు.
ఈ సందర్భంగా సమంత మాట్లాడుతూ ప్రస్తుతం సినిమాకు ఏ విధమైనటువంటి హద్దులు లేవని తెలిపారు. నార్త్ సౌత్ ఇండస్ట్రీలలో వచ్చే సినిమాలకు మధ్య ఏ విధమైనటువంటి అడ్డంకులు లేవని, ఈ విషయంలో తాను ఏ విధమైనటువంటి చర్చలకు తావివ్వడం లేదని తెలిపారు. ప్రస్తుతం ప్రతి ఒక్క సెలబ్రిటీలు కూడా ఇతర భాష సినిమాల్లో నటించడానికి ఆసక్తి చూపుతున్నారు.
ఇక ప్రేక్షకులు కూడా భాషతో సంబంధం లేకుండా అన్ని భాష చిత్రాలను చూడటానికి ఇష్టపడుతున్నారు. ఇలా సినిమాలలో కంటెంట్ ఉంటే భాషతో సంబంధం లేదని ఇప్పటికే ఎన్నో సినిమాలు నిరూపించాయి. అందుకే తనకు నార్త్ సౌత్ సినీ ఇండస్ట్రీల మధ్య ఏ విధమైనటువంటి తేడాలు అడ్డంకులు లేవంటూ ఈమె చేసినటువంటి కామెంట్స్ ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…