Pushpa 2 : పుష్ప 2 సినిమా ప్రపంచవ్యాప్తంగా డిసెంబర్ 5న విడుదలకు పెద్ద ఎత్తున సిద్ధమైంది. ఈ సందర్భంగా ఏపీ తెలంగాణలో ముందు రోజు అంటే డిసెంబర్ 4వ తేదీ రాత్రి 9:30 గంటలకు ప్రత్యేక వేసేందుకు అనుమతి లభించింది. రెండు రాష్ట్రాల్లోనూ ముందు రోజే బెనిఫిట్ షో పడుతుంది. ఇప్పటికే ట్విట్టర్ రివ్యూలు వచ్చేసాయి, ఇంట్రడక్షన్ సీన్ ఇంటర్వెల్ క్లైమాక్స్ సీన్స్ కి ఓ రేంజ్ లో విజిల్స్ పడతాయి అంటున్నారు బన్నీ ఫ్యాన్స్. ప్రస్తుతం ఆ సినిమాకి సంబంధించిన ప్రపంచం లో ఉన్నారు సినీ ప్రేమికులు. అయితే ఈ సినిమా ముందు నుంచి ఏదో ఒక ట్రోల్ కి గురవుతూనే ఉంది.
ఎంతోమంది ఈ సినిమాపై విమర్శలు కూడా చేశారు. టికెట్ల రేట్లు పెంచేశారని కొందరు అసహనం వ్యక్తం చేస్తూ ఉంటే మరొకరు ఈ సినిమాలలో డాన్సులు మరి దారుణంగా ఉన్నాయి అంటూ ట్రోన్స్ చేస్తున్నారు. పలువురు ఈ సినిమాపై కేసు వేసిన విషయం కూడా తెలిసిందే అయితే తాజాగా ఈ సినిమా ఒక బీజేపీ ఎమ్మెల్యే ఫైర్ అయ్యారు ఆయనే ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి. పుష్ప సినిమాలో చూపించిందంతా అబద్ధం. ఎర్రచందనం లక్ష రూపాయలు ఉంటే కోటి రూపాయలు లాగా చూపిస్తున్నారు.
దీంతో చాలామంది ఆ చెట్లను నరుకుతున్నారు, పుష్ప వన్ సమయంలో కూడా చాలామంది ఆ చెట్లని నరికేశారు, ఇప్పుడు ఇంకెన్ని నరికేస్తారో అంటూ ఫైర్ అయ్యారు. వెంటనే అల్లు అర్జున్, దర్శకుడు సుకుమార్ లని అరెస్టు చేయాలని డిమాండ్ చేశారు. ఈ సినిమాతో యువత పాడైపోతున్నట్లు చెప్పారు సమాజాన్ని చెడగొట్టే పుష్ప 2 సినిమాను రిలీజ్ కూడా చేయవద్దని డిమాండ్ చేశారు.
అయితే అతని వాదన సరి అయింది కాదు అంటూ అతనిపై ఫైర్ అవుతున్నారు అల్లు అర్జున్ ఫ్యాన్స్. ఈ సినిమా మొదటి పార్ట్ విడుదలైనప్పుడు కూడా సినిమాపై చాలా విమర్శలు వచ్చాయి కానీ పని అడ్డంకులు దాటుకొని ఆఖండ విజయాన్ని సాధించింది పుష్ప వన్. ఇప్పుడు పుష్ప 2 సినిమా కూడా అలాగే అన్ని విమర్శలని అన్ని అడ్డంకులని దాటుకొని పెద్ద హిట్ అవుతుంది అని ధీమా వ్యక్తం చేస్తున్నారు బన్నీ ఫ్యాన్స్.
ఇంట్లో తల్లి మందలించిందనే చిన్న విషయాన్ని మనసుకు పెట్టుకున్న ఓ బాలుడు అర్థరాత్రి ప్రమాదకర ప్రయాణానికి దిగిన ఘటన తెలంగాణలో…
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ నటిస్తున్న తాజా చిత్రం పెద్దిపై రోజురోజుకూ అంచనాలు పెరుగుతున్నాయి. ఇప్పటికే విడుదలైన గ్లింప్స్,…
దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి చేపట్టిన చారిత్రాత్మక పాదయాత్రకు నేటితో 23 సంవత్సరాలు పూర్తయ్యాయి. ఈ సందర్భంగా ఆయన తనయుడు,…
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ వ్యక్తిగత జీవితం గురించి అభిమానుల్లో ఎప్పుడూ ప్రత్యేక ఆసక్తి ఉంటుంది. ఆయన సినిమాలే కాదు,…
ప్రసిద్ధ సినీ నటి హన్సిక మోత్వాని కుటుంబ వివాదం ఇప్పుడు న్యాయస్థానాల వరకు వెళ్లింది. తన వదిన ముస్కాన్ నాన్సీ…
హాలీవుడ్ ప్రముఖ నటుడు మాథ్యూ పెర్రీ మృతి కేసులో కీలక మలుపు తిరిగింది. ఈ కేసులో ప్రధాన నిందితురాలిగా ఉన్న…