Nagachaitanya: సినీ నటుడు నాగచైతన్య శోభిత వివాహం మరికొన్ని గంటలలో జరగబోతోంది నేడు సాయంత్రం 8 గంటలకు అన్నపూర్ణ స్టూడియోలో వీరి వివాహం ఎంతో అంగరంగ వైభవంగా జరగబోతోంది. అత్యంత సన్నిహితులు శ్రేయోభిలాషులు కుటుంబ సభ్యుల సమక్షంలో బ్రాహ్మణ కుటుంబ సాంప్రదాయ ఆచారాల ప్రకారం వీరి వివాహం ఘనంగా జరగబోతోంది.
ఇలా నాగచైతన్య శోభిత పెళ్లి జరగబోతున్న నేపథ్యంలో ప్రస్తుతం నాగచైతన్య సమంతకు సంబంధించి ఓ ఫోటో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. నాగచైతన్య సమంతకు విడాకులు ఇచ్చిన తర్వాత ఆమె జ్ఞాపకాలు అన్నింటిని కూడా చెరిపేస్తూ వచ్చారు.. ఇటీవల సమంతతో కలిసి రేస్ వెళ్లినటువంటి ఒక ఫోటోని కూడా ఆయన డిలీట్ చేశారు కానీ సమంతతో చాలా రొమాంటిక్ మూడ్ లో ఉన్నటువంటి ఫోటోని మాత్రం ఇప్పటికీ అలాగే పెట్టుకోవటం విశేషం.
ఇలా సమంతతో దిగిన ఆ రొమాంటిక్ ఫోటోని నాగచైతన్య తన సోషల్ మీడియాలో డిలీట్ చేయకపోవడం పట్ల కొందరు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. శోభితతో కొత్త జీవితాన్ని ప్రారంభించబోతున్న చైతు ఆ ఫోటోని డిలీట్ చేయడం మంచిది అంటూ కొందరు కామెంట్లు చేయగా మరికొందరు మాత్రం ఆయన తన వ్యక్తిగతంగా ఆ ఫోటోని ఉంచడం లేదని కేవలం సినిమాకు సంబంధించిన పోస్టర్ కావడంతో అలాగే ఉంచారంటూ కామెంట్లు చేస్తున్నారు.
సమంత నాగచైతన్య చివరిగా నటించిన మజిలీ సినిమాలోని ఒక పోస్టర్ ను నాగచైతన్య ఇప్పటికి తన సోషల్ మీడియాలో అలాగే ఉంచారు . దీంతో ఈ పోస్టర్ పై అభిమానుల మధ్య కూడా పెద్ద ఎత్తున చర్చలు జరుగుతున్నాయి.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…