ప్రపంచ దేశాల్లో కరోనా మహమ్మారి విజృంభణ కొనసాగుతోంది. ప్రతిరోజూ రికార్డు స్థాయిలో కొత్త కేసులు, మరణాలు నమోదవుతున్నాయి. శాస్త్రవేత్తలు, వైద్య నిపుణులు ఎంత శ్రమించినా కరోనాకు వ్యాక్సిన్ అందుబాటులోకి రావడానికి ఇంకా చాలా సమయమే పట్టేలా ఉంది. కరోనా మహమ్మారి గురించి శాస్త్రవేత్తల పరిశోధనల్లో షాకింగ్ విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. భారత్ లో ఇప్పటివరకు 73 లక్షలకు పైగా కేసులు నమోదయ్యాయి.
కరోనా మహమ్మారి విజృంభించిన చాలా రోజుల తర్వాత మరో కొత్త లక్షణం వెలుగులోకి వచ్చింది. కళ్లల్లో రక్తం గడ్డకట్టడం కూడా కరోనా వైరస్ లక్షణమేనని శాస్త్రవేత్తలు వెల్లడిస్తున్నారు. మిగతా రాష్ట్రాలతో బీహార్ లో కళ్లలో రక్తం గడ్డ కడుతూ కరోనా వైరస్ నిర్ధారణ అవుతున్న కేసులు అంతకంతకూ పెరుగుతున్నాయి. పాట్నాలోని ఎయిమ్స్ కు పదుల సంఖ్యలో రోగులు ఈ లక్షణంతో ఆస్పత్రిలో చేరినట్టు వైద్యులు చెబుతున్నారు.
ఎవరైతే కరోనా వైరస్ బారిన పడతారో వారిలో సాధారణ వ్యక్తులతో పోల్చి చూస్తే రక్త ప్రవాహం వేగంగా ఉంటుంది. ఫలితంగా కళ్లల్లో సైతం రక్త ప్రవాహం పెరుగుతుంది. శరీరంలోని సన్నని నాళాల్లో రక్తం ఇన్ఫెక్షన్ వల్ల ప్రవహించలేకపోవడంతో గడ్డ కడుతున్నట్టు శాస్త్రవేత్తలు తేల్చారు. కరోనా వైరస్ నుంచి కోలుకున్న తరువాత కళ్లు సాధారణ స్థితికి చేరుకుంటాయని వైద్యులు చెబుతున్నారు.
పాట్నా ఎయిమ్స్ కార్డియో థొరాసిక్ సర్జరీ విభాగం అధిపతి డాక్టర్ సంజీవ్‌కుమార్ మాట్లాడుతూ కరోనా వైరస్ దుష్ప్రభావాలు ఇప్పుడు కళ్లపై కనిపిస్తున్నాయని అన్నారు. రెటీనాలో రక్తం గడ్డకట్టడం ప్రమాదకర లక్షణమని.. కరోనా తీవ్రత ఎక్కువగా ఉంటే కంటిచూపు కోల్పోయే అవకాశాలు ఉంటాయని శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారు.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…