ప్రపంచ దేశాల్లో కరోనా మహమ్మారి విజృంభణ కొనసాగుతోంది. ప్రతిరోజూ రికార్డు స్థాయిలో కొత్త కేసులు, మరణాలు నమోదవుతున్నాయి. శాస్త్రవేత్తలు, వైద్య నిపుణులు ఎంత శ్రమించినా కరోనాకు వ్యాక్సిన్ అందుబాటులోకి రావడానికి ఇంకా చాలా సమయమే పట్టేలా ఉంది. కరోనా మహమ్మారి గురించి శాస్త్రవేత్తల పరిశోధనల్లో షాకింగ్ విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. భారత్ లో ఇప్పటివరకు 73 లక్షలకు పైగా కేసులు నమోదయ్యాయి.

కరోనా మహమ్మారి విజృంభించిన చాలా రోజుల తర్వాత మరో కొత్త లక్షణం వెలుగులోకి వచ్చింది. కళ్లల్లో రక్తం గడ్డకట్టడం కూడా కరోనా వైరస్ లక్షణమేనని శాస్త్రవేత్తలు వెల్లడిస్తున్నారు. మిగతా రాష్ట్రాలతో బీహార్ లో కళ్లలో రక్తం గడ్డ కడుతూ కరోనా వైరస్ నిర్ధారణ అవుతున్న కేసులు అంతకంతకూ పెరుగుతున్నాయి. పాట్నాలోని ఎయిమ్స్ కు పదుల సంఖ్యలో రోగులు ఈ లక్షణంతో ఆస్పత్రిలో చేరినట్టు వైద్యులు చెబుతున్నారు.

ఎవరైతే కరోనా వైరస్ బారిన పడతారో వారిలో సాధారణ వ్యక్తులతో పోల్చి చూస్తే రక్త ప్రవాహం వేగంగా ఉంటుంది. ఫలితంగా కళ్లల్లో సైతం రక్త ప్రవాహం పెరుగుతుంది. శరీరంలోని సన్నని నాళాల్లో రక్తం ఇన్ఫెక్షన్ వల్ల ప్రవహించలేకపోవడంతో గడ్డ కడుతున్నట్టు శాస్త్రవేత్తలు తేల్చారు. కరోనా వైరస్ నుంచి కోలుకున్న తరువాత కళ్లు సాధారణ స్థితికి చేరుకుంటాయని వైద్యులు చెబుతున్నారు.

పాట్నా ఎయిమ్స్‌ కార్డియో థొరాసిక్‌ సర్జరీ విభాగం అధిపతి డాక్టర్‌ సంజీవ్‌కుమార్‌ మాట్లాడుతూ కరోనా వైరస్ దుష్ప్రభావాలు ఇప్పుడు కళ్లపై కనిపిస్తున్నాయని అన్నారు. రెటీనాలో రక్తం గడ్డకట్టడం ప్రమాదకర లక్షణమని.. కరోనా తీవ్రత ఎక్కువగా ఉంటే కంటిచూపు కోల్పోయే అవకాశాలు ఉంటాయని శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here