ప్రస్తుతం బాలీవుడ్ ఇండస్ట్రీలో హనీ ట్రాప్ వ్యవహారం రోజురోజుకు తారాస్థాయికి చేరుకుంటుంది.ఎంతోమంది సైబర్ నేరగాళ్లు సోషల్ మీడియా వేదికగా సెలబ్రిటీలతో పరిచయాలు ఏర్పరచుకొనే వారికి మాయమాటలు చెప్పి వారితో నగ్నంగా వీడియో కాల్స్ మాట్లాడే వాటిని రికార్డు చేస్తూ సదరు సెలబ్రెటీలను బ్లాక్ మెయిల్ చేస్తూ లక్షల్లో డబ్బులను సంపాదిస్తున్నారు. ఈ క్రమంలోనే సెలబ్రిటీల ఫిర్యాదుల మేరకు రంగంలోకి దిగిన ముంబై పోలీసులు అరెస్టు చేశారు. ఈ క్రమంలోనే వీరిని విచారించగా సంచలన నిజాలు బయటపడ్డాయి.
ముంబై పోలీసులు అరెస్ట్ చేసిన నిందితులలో ఇద్దరు ఇంజనీర్లు ఇద్దరు సైన్స్ గ్రాడ్యుయేట్స్ కాగా మరొకరు మైనర్ గా ఉన్నట్టు పోలీసులు వెల్లడించారు. ఈ క్రమంలోనే నిందితుల నుంచి పోలీసులు ఏకంగా 285 మంది నగ్న వీడియోలను స్వాధీనం చేసుకున్నారు. వీరిలో ఏకంగా వందమంది సెలబ్రిటీల నగ్న వీడియోలు ఉండటం గమనార్హం. నిందితుల నుంచి పోలీసులు 12 నకిలీ ఖాతాలను, ఇతర ఎలక్ట్రానిక్ పరికరాలు స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు.
ఈ విధంగా సైబర్ నేరగాళ్లు సోషల్ మీడియా వేదికగా అకౌంట్ క్రియేట్ చేసి ఫ్రెండ్ రిక్వెస్ట్ లు పెడతారని, ఈ విధంగా సెలబ్రిటీలతో పరిచయాలు ఏర్పరచుకొని వారితో వీడియో కాల్స్ మాట్లాడుతూ.. మరింత దగ్గరవుతారు. ఈ క్రమంలోనే వారితో నగ్నంగా వీడియో కాల్స్ మాట్లాడుతూ వాటిని రికార్డు చేసుకొని వారిపై బెదిరింపులకు దిగుతున్నారు.
ఈ క్రమంలోనే ఈ నగ్న వీడియోలను సైబర్ నేరగాళ్లు డార్క్‌వెబ్ వంటి ఫోర్న్ సైట్లకు అమ్ముతూ లక్షల్లో డబ్బులు పోగు చేస్తున్నారు. ఈ సందర్భంగా ముంబై పోలీసులు మాట్లాడుతూ మనకు తెలియని నంబర్ ల నుంచి మనకు ఫ్రెండ్ రిక్వెస్ట్ వస్తే ఎలాంటి పరిస్థితుల్లో కూడా వాటిని యాక్సెప్ట్ చేయకపోవడం ఎంతో ఉత్తమమని, తెలియని వాళ్ళతో వీడియో కాల్స్ మాట్లాడటం వల్ల ఈ విధమైనటువంటి పరిస్థితులను ఎదుర్కోవాల్సి వస్తుందని ఈ సందర్భంగా ముంబై పోలీసులు హెచ్చరించారు.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…