Bonalu postponed in Telangana! Minister Surekha's sensational announcement!
తెలంగాణలో దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ తీసుకున్న తాజా నిర్ణయం పెద్ద చర్చనీయాంశంగా మారింది. వరంగల్‌లోని ప్రసిద్ధ భద్రకాళి అమ్మవారి ఆలయంలో నిర్వహించాల్సిన బోనాల పండుగను తాత్కాలికంగా వాయిదా వేస్తున్నట్లు ఆమె అధికారికంగా ప్రకటించారు. ఈ నిర్ణయానికి కారణంగా పండుగను రాజకీయ రంగంలోకి లాగే ప్రయత్నాలు, అసాంఘిక శక్తులు గొడవలకు ప్రేరేపించబోతున్నాయన్న అనుమానాలున్నాయని పేర్కొన్నారు.
ఆగమ శాస్త్రం ప్రకారం శాకాహార బోనాలే నిర్వహించాలని ఆలయ పాలకులు, వేద పండితులు సూచించినప్పటికీ, కొందరు శక్తులు మాంసాహార బోనాల నిర్వహణపై తప్పుడు ప్రచారాన్ని మొదలుపెట్టారని మంత్రి సురేఖ ఆవేదన వ్యక్తం చేశారు. దీంతో భక్తుల మధ్య తప్పుడు సంకేతాలు వెళ్లే ప్రమాదం ఉండటంతో, శాంతియుత వాతావరణం కోసం తాత్కాలికంగా పండుగను వాయిదా వేసినట్లు వెల్లడించారు. ప్రజల మనోభావాలను గౌరవించడమే ఈ నిర్ణయానికి ప్రథమ ప్రాధాన్యం అని ఆమె స్పష్టం చేశారు.
ఇదే సందర్భంలో, స్టేషన్ ఘన్‌పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి పై కూడా మంత్రి సురేఖ తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. తన మంత్రి పదవి పోతుందన్న కోణంలో తప్పుడు ప్రచారం చేస్తున్నారని, తనకు నామోషీగా ఫీల్ అవుతున్నాడంటూ విమర్శలు గుప్పించారు. “కడియం కాంగ్రెస్‌లోనూ టీడీపీలో ఉన్నట్లే వ్యవహరించాలని చూస్తున్నాడు” అని మంత్రి వ్యాఖ్యానించారు. ఆయన సీఎం రేవంత్ రెడ్డి, మంత్రి పొంగులేటి శ్రీనివాస్ వద్దకు వెళ్లి తనపై అవాస్తవాల్ని చెబుతున్నాడని ఆరోపించారు.
ఇప్పటికే వివాదాస్పదంగా మారిన భద్రకాళి బోనాల అంశం, రాజకీయంగా మరింత వేడి పుట్టిస్తుందని రాజకీయ పరిశీలకులు భావిస్తున్నారు. భవిష్యత్ కార్యాచరణపై ప్రభుత్వం పండితులతో, ఆలయ కమిటీతో సంప్రదింపులు జరిపి త్వరలోనే స్పష్టత ఇవ్వనుంది.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…