Categories: General News

Padmavathi Express : పద్మావతి ఎక్స్‌ప్రెస్‌లో దొంగల బీభత్సం.. మూడు బోగీల్లో చోరీ!

పద్మావతి ఎక్స్‌ప్రెస్‌లో దొంగలు బీభత్సం సృష్టించారు. సికింద్రాబాద్‌ నుంచి తిరుపతికి వెళ్తున్న ఈ రైల్లో దుండగులు మూడు బోగీల్లో చోరీలకు పాల్పడ్డారు. ప్రయాణంలో ఉన్న ముగ్గురు మహిళల వద్ద ఉన్న సుమారు 40 గ్రాముల బంగారు ఆభరణాలను అపహరించారు. అలాగే దాదాపు రూ. 2 వేల నగదు, ఒక మొబైల్ ఫోన్ కూడా దొంగతనానికి గురైనట్లు సమాచారం. ఈ ఘటన కావలి మరియు శ్రీ వెంకటేశ్వర పాలెం రైల్వే స్టేషన్ల మధ్య చోటు చేసుకుంది.

ప్రయాణికులు నిద్రలో ఉండగా దుండగులు బోగీల్లోకి చొరబడి విలువైన వస్తువులను అపహరించారని భావిస్తున్నారు. బాధితులు ఉదయం గమనించి రైల్వే అధికారులకు ఫిర్యాదు చేశారు. సమాచారం అందుకున్న వెంటనే రైల్వే పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. ఈ దొంగతనంతో రైళ్లలో ప్రయాణించేవారిలో ఆందోళన నెలకొనింది. రైళ్లలో భద్రతపై మళ్ళీ ప్రశ్నలు రేకెత్తుతున్నాయి.

telugudesk

Recent Posts

పురాణపండ ఎత్తిన మంత్ర పతాకం ‘గౌరీపుత్ర నమస్తేస్తు’ అదిరింది..

హైదరాబాద్, సికింద్రాబాద్ వంటి జంటనగరాల్లోనే కాకుండా విశాఖపట్నం, విజయవాడ, బళ్ళారి, కాకినాడ, గుంటూరు, కర్నూల్, ఒంగోలు, నెల్లూరు, రాజమండ్రి వంటి…

1 month ago

సువాసన ఉన్న ప్యాడ్స్ వాడుతున్నారా?.. ఆరోగ్యానికి ముప్పు అంటున్న వైద్యులు!

ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…

3 months ago

సంజూ శాంసన్‌కు బీసీసీఐ గుడ్‌న్యూస్.. మెగా టోర్నీకి గ్రీన్ సిగ్నల్!

భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…

3 months ago

ప్రభుత్వ విద్యార్థులకు భారీ గుడ్‌న్యూస్.. ఉచిత ల్యాప్‌టాప్‌లు.. ఇకపై స్కూల్‌లోనే AI శిక్షణ..!

తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…

4 months ago

డ్వాక్రా మహిళలకు భారీ ఊరట..సీఎం చంద్రబాబు నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…

4 months ago

క్యాప్‌జెమిని డే కేర్‌లో షాకింగ్ ఘటన.. చిన్నారిపై అమానుష వేధింపులు.. వైరల్ వీడియోలతో కలకలం

బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…

4 months ago