Brahmanandam: టాలీవుడ్ ఇండస్ట్రీలో కమెడియన్ గా గుర్తింపు పొందిన వారిలో బ్రహ్మానందం కూడా ఒకరు. ఎన్నో దశాబ్దాలుగా ఇండస్ట్రీలో కమెడియన్ గా రాణిస్తూ గుర్తింపు పొందిన బ్రహ్మానందం నంబర్ వన్ కమెడియన్ గా చెరగని ముద్ర వేసుకున్నాడు. ఎన్నో సినిమాలలో నటించి తన హావభావాలతో ప్రేక్షకులను కడుపుబ్బ నవ్వించే బ్రహ్మానందం అంటే చిన్నపిల్లలకు సైతం అమితమైన అభిమానం. ఇప్పటికీ సోషల్ మీడియాలో ఈయన ఇమేజెతో ఉన్న మీమ్స్ బాగా ట్రెండ్ అవుతున్నాయి.
ఇంతకాలం ప్రతీ సినిమాలోనూ తన నటనతో ప్రేక్షకులను నవ్వించిన బ్రహ్మానందం కొంతకాలం క్రితం హార్ట్ సర్జరీ చేయించుకోవడం వల్ల సినిమాలలో ఎక్కువగా కనిపించటం లేదు. అయితే కొన్ని సినిమాలో ముఖ్యమైన తక్కువ నివిడి ఉన్న పాత్రలలో నటిస్తూ ప్రేక్షకులను నవ్విస్తున్నాడు. ఇటీవల బాలకృష్ణ హీరోగా నటించిన వీర సింహారెడ్డి సినిమాలో కూడా ఒక కీలక పాత్రలో కనిపించాడు. అంతేకాకుండా రంగమార్తాండ సినిమాలో కూడా కీలక పాత్రలో కనిపించనున్నాడు.
ఇదిలా ఉండగా తాజాగా భార్యతో కలిసి ఉన్న బ్రహ్మానందం ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఈ ఫోటోలను బ్రహ్మానందం తనయుడు గౌతమ్ స్వయంగా సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. దీంతో ఈ ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. బ్రహ్మానందం కమెడియన్ గా మాత్రమే కాకుండా తన కళా నైపుణ్యంతో కూడా అభిమానులను ఆశ్చర్యపరుస్తున్నాడు. చాలా కాలంగా సినిమాలను తగ్గించి ఇంట్లో ఎక్కువ సమయం గడుపుతున్న బ్రహ్మానందం తనలో ఉన్న టాలెంట్ తో అద్భుతమైన డ్రాయింగ్స్ వేస్తున్నాడు.
ఆ డ్రాయింగ్స్ కి సంబంధించిన ఫోటోలు కూడా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఈ ఫోటోలు చూసి పలువురు సినీ ప్రముఖులతో పాటు ఆయన అభిమానులు కూడా ప్రశంసలు కురిపిస్తున్నారు. అయితే అనారోగ్య కారణాలవల్ల బ్రహ్మానందం సినిమాలలో ఎక్కువగా కనిపించకపోవటంతో ఆయన అభిమానులు కొంతవరకు నిరాశ చెందుతున్నారు.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…