General News

అక్క కోసం కిడ్నీ త్యాగం చేసిన తమ్ముడు.. నిజమైన రక్షా బంధన్‌కు అర్ధం చెప్పిన అక్కతమ్ముడు!

అన్నా చెల్లెలు అనుబంధానికి గుర్తుగా రక్షా బంధన్ ను జరుపుకుంటారు. సోదరీమణులు తమ సోదరుల మణికట్టుకు రాఖీలు కడతారు. అన్నకు చెల్లి అండగా, చెల్లికి అన్న తోడుగా జీవితాంతం ఉంటామని భరోసా ఇచ్చే ఈ పండుగను కొన్ని ప్రాంతాలలో శ్రావణ పౌర్ణమి లేదా జంధ్యాల పూర్ణిమ అని కూడా అంటారు. అన్నా చెల్లెళ్ళు , అక్కా తమ్ముళ్ళ మధ్య ప్రేమానురాగాలకు ప్రతీకగా జరుపుకునే పండుగనే రాఖీ పండుగ. నేడు ఈ పండుగను జరుపుకోనున్నారు. ఇదిలా ఉండగా ఓ వ్యక్తి రక్షా బంధన్‌కు నిజమైన అర్థం చెప్పాడు. ప్రాణాప్రాయ స్థితిలో ఉన్న తన అక్కను రక్షించుకున్నాడు.

తన కిడ్నీని దానం చేసి ఆమె జీవితంలో వెలుగులు నింపాడు. ఈ ఘటన హర్యానాలో చోటుచేసుకుంది. పూర్తి వివరాల్లోకి వెళ్తే.. హర్యానాలోని రోహ్ తక్ కు చెందిన ఓ 31 ఏళ్ల మహిళ గత ఐదు సంవత్సరాల నుంచి కిడ్నీ వ్యాధితో బాధపడుతోంది. చాలా రోజుల నుంచి వైద్యుల పర్యవేక్షణలో చికిత్స తీసుకుంటోంది. అయితే ఆమెకు రక్త పోటు కూడా ఉండటంతో పరిస్థితి విషమించిందని ఆకాశ్ హెల్త్‌కేర్ వైద్యులు తెలిపారు. ఆమెకు మొదట ఆరోగ్యంపై అశ్రద్ధ వహించడంతో ఇప్పుడు ఈ పరిస్థితి వచ్చిందని వైద్యులు తెలిపారు. దీంతో ఆమె అవయవాలపై కూడా ప్రభావాన్ని చూపించినట్లు తెలిపారు. వెంటనే ఆమెకు డయాలసిస్ నిర్వహించడంతో.. ఆమె మంచి ఆహారం తీసుకోవడం ప్రారంభించిందన్నారు. ఇది కాస్త ఆమె ఆరోగ్యం మెరుగుపడటానికి దారితీసింది.

దీంతో ఆమె వయస్సును పరిగణలోకి తీసుకొని కుటుంబసభ్యులకు కిడ్నీ మార్పిడి చేయాలని సూచించారు. వైద్యులు కిడ్నీ దానం చేసే వ్యక్తి కోసం ప్రయత్నాలు ప్రారంభించారు. కానీ ఆ మహిళ కుటుంబసభ్యులే కిడ్నీ దానం చేయడానికి ముందుకు వచ్చారు. మొదట ఆమె భర్త కిడ్నీ ఇచ్చేందుకు ముందుకు రాగా.. అతడి బ్లడ్ గ్రూప్ సరిపోలేదు. ఆమె 28 ఏళ్ల తమ్ముడి బ్లడ్ గ్రూప్ సరిపోవడంతో అతడు కిడ్నీ దానం చేయడానికి రెడీ అయ్యాడు. దీంతో వైద్యులు అతడికి వైద్య పరీక్షలు నిర్వహించి ఐదు గంటల సుదీర్ఘ శస్త్ర చికిత్స చేసి కిడ్నీ మార్పిడి పూర్తి చేశామని వైద్యులు తెలిపారు. దీంతో ఆమె కుటుంబసభ్యులు ఆనందం వ్యక్తం చేశారు. దీనిపై వైద్యులు స్పందిస్తూ.. ‘ఆమె యువ వివాహిత మాదిరిగా సాధారణ జీవితాన్ని గడపవచ్చు. ఆమె కోరుకున్న సమయంలో తల్లి కావచ్చు’అని తెలిపారు.

కిడ్నీ దానం చేసిన వ్యక్తి మాట్లాడుతూ.. కిడ్నీ వ్యాధితో తన అక్క చాలా బాధపడిందని.. ఆమె బాధను చూడలేక తాము తట్టుకోలేకపోయామని .. వైద్యులు తన కిడ్నీ సరిపోతుందని చెప్పగానే ఒక్క క్షణం కూడా ఆలోచించలేదని అన్నాడు. ఇక నుంచి తన అక్క సంతోషంగా ఉంటుందని.. అంతకంటే ఏం కావాలి అంటూ ఆమె సోదరుడు భావోద్వేగానికి గురయ్యాడు. అయితే రాఖీ పండుగ నేపథ్యంలో ఇలా తన కిడ్నీని దానం చేయడంతో నెటిజన్లు రాఖీ పండుగకు నిజమైన అర్థం ఇచ్చారంటూ ప్రశంసించారు.

lakshana

Lakshana Reddy is Flash News Reporter in Telugudesk.net. Lakshana Reddy covers all Movies and Flash/Breaking News happenings and in Telugu States & Around World.

Recent Posts

‘బీజేపీ అహంకారానికి ఈ మంటలే సమాధానం’.. స్టాలిన్ సంచలన వ్యాఖ్యలు

తమిళనాడులో డీలిమిటేషన్ బిల్లుపై రాజకీయ ఉద్రిక్తతలు పెరుగుతున్నాయి. రాష్ట్ర ముఖ్యమంత్రి ఎం.కె. స్టాలిన్ కేంద్ర ప్రభుత్వ ప్రతిపాదనపై తన నిరసనను…

25 minutes ago

పాస్ చేయండి సార్ అంటూ బోర్డుకు కాల్.. విశాఖలో విద్యార్థి వింత ఘటన

ఆంధ్రప్రదేశ్‌లోని విశాఖపట్నంలో ఓ ఇంటర్ విద్యార్థి చేసిన ఫోన్ కాల్ ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది. ఫలితాలు వెలువడక ముందే ఫెయిల్…

34 minutes ago

కూతురి ప్రాణం తీశిన తండ్రి.. భువనగిరిలో దారుణం

యాదాద్రి భువనగిరి జిల్లాలోని హనుమాపురం గ్రామంలో హృదయ విదారక ఘటన వెలుగులోకి వచ్చింది. కుటుంబ కలహాల మధ్య ఓ తండ్రి…

1 hour ago

గురువారం పూజతో అదృష్టం మారుతుందా? కాశీలో అరుదైన బృహస్పతి ఆలయం.. గురు దోషాలకు ప్రత్యేక పరిష్కారం!

భారతదేశంలో ఆధ్యాత్మిక ప్రాధాన్యత కలిగిన క్షేత్రాల్లో కాశీ ప్రత్యేక స్థానం పొందింది. అదే కాశీలో అరుదుగా దర్శనమిచ్చే దేవగురువు బృహస్పతి…

1 hour ago

రూ.10 కోట్ల స్కామ్ ఆరోపణలు.. మంగ్లీపై వివాదం మరింత ముదురు

తెలుగు రాష్ట్రాల్లో సంచలనం రేపుతున్న ప్రముఖ గాయని మంగ్లీకు సంబంధించిన మోసం ఆరోపణలు రోజురోజుకు కొత్త మలుపులు తిరుగుతున్నాయి. మైక్రో…

2 hours ago

‘మహిళ గౌరవమే దేశ గౌరవం’.. బిల్లుల ముందు మోదీ ట్వీట్ వైరల్

పార్లమెంట్‌లో మహిళా సాధికారతకు సంబంధించిన కీలక చర్చలు ప్రారంభం కానున్న వేళ, ప్రధాని నరేంద్ర మోదీ సామాజిక మాధ్యమం ‘ఎక్స్’లో…

2 hours ago