Featured

ప్రజలకు అదిరిపోయే శుభవార్త.. త్వరలో పెట్రోల్ అక్కర్లేని కార్లు..?

మనలో చాలామంది కార్లను కొనుగోలు చేయాలని అనుకుంటూ ఉంటారు. అయితే కారును కొనుగోలు చేయడం కంటే కారుకు అవసరమైన పెట్రోల్, ఇతర ఖర్చులకే ఎక్కువమొత్తంలో ఖర్చు చేయాల్సి వస్తుంది. అందువల్లే చాలామంది కారు కొనుగోలుకు దూరంగా ఉంటున్నారు. అయితే పెట్రోల్ అవసరం లేని కారు అందుబాటులోకి వస్తే మాత్రం వాహనదారులకు ఎంతో ప్రయోజనకరంగా ఉంటుంది.

కేంద్ర రోడ్డు రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీ దేశంలోని ప్రజలకు అదిరిపోయే శుభవార్త చెప్పారు. వాహనదారులకు కార్లలో ఫ్లెక్సీ ఇంజిన్ ఆప్షన్ ప్లాన్‌ ను అందుబాటులోకి తీసుకొస్తామని ఈ ఆప్షన్ అందుబాటులోకి వస్తే వాహనదారులకు ప్రయోజనం చేకూరుతుందని అన్నారు. ఈ నిర్ణయం వల్ల వాహనదారులు తమ వాహనాల్లో ఇంధనంగా ఇథనాల్ ను కూడా వాడుకునే అవకాశం కలుగుతుంది. వాహనదారులు వాహనంలో ఇథనాల్ ను వినియోగిస్తే తక్కువ ఖర్చుతోనే ప్రయాణం చేయవచ్చు.

చెరుకును వినియోగించి ఇథనాల్ ను తయారు చేయవచ్చని.. ప్రజలు వీలైనంత వరకు ఇథనాల్ వినియోగాన్ని పెంచితే ప్రయోజనకరంగా ఉంటుందని మంత్రి అభిప్రాయపడ్డారు. ఆటోమొబైల్ ఇండస్ట్రీకి ‘ఆత్మనిర్బర్ భారత్’లో భాగంగా కేంద్ర ప్రభుత్వం పూర్తిస్థాయిలో సహకారాన్ని అందిస్తుందని వెల్లడించారు. ఫ్లెక్స్ ఫ్యూయల్ ఇంజిన్ల సహాయంతో ప్రత్యామ్నాయ ఇంధన వినియోగాన్ని ప్రోత్సహిస్తామని చెప్పారు.

ఆటోమేకర్లు గ్రీన్ ఫ్యూయల్‌ ను విక్రయించడానికి సొంతంగా ఫ్యూయల్ పంపులను ఏర్పాటు చేసుకోవచ్చని సూచనలు చేశారు. ఇప్పటికే ఇతర దేశాల్లో ఫ్లెక్స్ ఇంజిన్లను వినియోగిస్తున్నారు. బీఎస్-4 నుంచి కారు బీఎస్ 6కు మారితే ఫ్లెక్స్ ఇంజిన్లను అమర్చవచ్చు.

lakshana

Lakshana Reddy is Flash News Reporter in Telugudesk.net. Lakshana Reddy covers all Movies and Flash/Breaking News happenings and in Telugu States & Around World.

Recent Posts

21న ఈ ఏడాదిలోనే అత్యంత పొడవైన పగలు.. ఎందుకలా జరుగుతుంది?

ప్రకృతిలో జరిగే కొన్ని ఖగోళ అద్భుతాలు మన కళ్లకు నేరుగా కనిపించకపోయినా వాటి ప్రభావాన్ని మాత్రం మనం స్పష్టంగా అనుభవిస్తాం.…

22 hours ago

యుక్త వయసులో చేసే ఈ చిన్న తప్పులే.. పెద్దయ్యాక పెద్ద వ్యాధులకు కారణమవుతాయా?

చిన్న వయసులో ఆరోగ్యం గురించి పెద్దగా ఆలోచించని వారు చాలా మంది ఉంటారు. "ఇప్పుడేం కాదు.. తర్వాత చూసుకుందాం", "ఇంకా…

23 hours ago

ఎంత సంపాదించినా రూపాయి మిగలడం లేదా..? ఈ చిన్న అలవాట్లు మార్చుకుంటేనే ఆర్థిక భద్రత మీ సొంతం

ఈ రోజుల్లో డబ్బు లేకుండా ఏ పని జరగని పరిస్థితి. ఉదయం ఇంటి నుంచి బయటకు అడుగు పెట్టిన దగ్గర…

23 hours ago

కరివేపాకు రెండు రోజులకే నల్లబడిపోతుందా..? ఈ చిన్న చిట్కాలతో నెలరోజులైనా పచ్చగా, తాజాగా ఉంచుకోవచ్చు!

మన తెలుగు వంటింట్లో కరివేపాకుకు ప్రత్యేక స్థానం ఉంది. పప్పు నుంచి పులుసు వరకు, చట్నీ నుంచి ఫ్రై వరకు…

23 hours ago

రెండు లక్షల పుస్తకాలతో పరిమళించిన మై హోమ్ అవతార్‌లో చరిత్రకెక్కిన పురాణపండ!

హైదరాబాద్, జూన్ 20: నిర్మొహమాటంగా నికార్సుగా చెప్పాల్సి వస్తే తెలుగు రాష్ట్రాల్లో నిస్వార్ధ సేవకు నిలువెత్తు అక్షరంగా ప్రతిభతో, ప్రజ్ఞతో,…

1 day ago

కూరలో ఉప్పు ఎక్కువైందా? ఇక టెన్షన్ అవసరం లేదు.. ఈ సింపుల్ చిట్కాలతో రుచి మళ్లీ సెట్!

వంట చేయడం ఒక కళ. అందులో రుచి రావాలంటే ఉప్పు, కారం, మసాలాలు అన్నీ సరైన మోతాదులో ఉండాలి. అయితే…

3 days ago