Casting Couch: సినిమా ఇండస్ట్రీలో క్యాస్టింగ్ కౌచ్ ఉందనే విషయం మనకు తెలిసిందే. ఎంతో మంది ఇండస్ట్రీలోకి వచ్చిన మొదట్లో అవకాశాల కోసం ఇలాంటి ఇబ్బందులు ఎదుర్కొన్నామని, అయితే మనం కమిట్మెంట్ ఇవ్వాలా లేదా అన్నది పూర్తిగా మన నిర్ణయమే అంటూ చాలామంది ఈ విషయం గురించి బహిరంగంగా తెలియజేశారు. సీనియర్ హీరోయిన్ల నుంచి మొదలుకొని యంగ్ హీరోయిన్ల వరకు కూడా ఇలాంటి ఇబ్బందులను ఎదుర్కొన్నారని చెప్పాలి.
క్యాస్టింగ్ కౌచ్ ఇబ్బందులను ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్ల నుంచి చిన్న చిన్న ఆర్టిస్టులు బుల్లితెర నటీనటులు కూడా ఎదుర్కొన్నారు అయితే గత కొద్దిరోజుల క్రితం ప్రముఖ బాలీవుడ్ దివంగత నటుడు అమ్రిష్ పురి మనవడు సైతం తాను కూడా క్యాస్టింగ్ కౌచ్ ఇబ్బందులు ఎదుర్కొన్నాను అంటూ షాకింగ్ కామెంట్ చేశారు. అయితే తాజాగా మరొక నటుడు సైతం తాను కెరియర్ మొదట్లో ఎదుర్కొన్న ఇబ్బందులను తెలిపారు.
ప్రస్తుతం హిందీలో బిగ్ బాస్ సీజన్ సిక్స్ కార్యక్రమం కొనసాగుతుంది ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి నటుడు అంకిత్ గుప్తా ఈ కార్యక్రమం నుంచి ఎలిమినేట్ అయ్యారు. అయితే ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్నటువంటి ఈయన తాను కూడా కెరియర్ మొదట్లో క్యాస్టింగ్ కౌచ్ ఇబ్బందులను ఎదుర్కొన్నానని తెలిపారు. ఒక వ్యక్తి తనకు సినిమా అవకాశం కల్పిస్తానని చెప్పి కాంప్రమైజ్ కావాలని అడిగారు.
కొంతమంది స్టార్ సెలబ్రిటీల పేర్లు చెప్పి వారందరూ కూడా ఇలాంటి ఇబ్బందులను ఎదుర్కొన్న వారేనని, ఇలాంటి ఇబ్బందులు తప్పవు అంటూ స్వయంగా తనతో చాలా అసభ్యంగా ప్రవర్తిస్తూ తాక రాని చోట తాకడానికి ప్రయత్నం చేశారని అంకిత్ గుప్తా తెలిపారు. అయితే తాను అక్కడి నుంచి ఆ క్షణమే బయటకు వెళ్లిపోయానని నా జీవితంలో అత్యంత చెత్త సంఘటన ఇదేనని అంకిత్ గుప్త తెలిపారు. ప్రస్తుతం ఈయన చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి
వ్యవసాయం అనేది దేశ ఆర్థిక వ్యవస్థకు వెన్నెముక. రైతు సంతోషంగా ఉంటేనే గ్రామీణ ఆర్థిక వ్యవస్థ బలోపేతం అవుతుంది. అయితే…
అమెరికా మాజీ అధ్యక్షుడు, ప్రస్తుతం దేశ రాజకీయాల్లో అత్యంత ప్రభావశీల నాయకుడిగా కొనసాగుతున్న డొనాల్డ్ ట్రంప్ మరోసారి వలసల అంశంపై…
ఈ రోజుల్లో మనం దుస్తులు కొనేటప్పుడు ఎక్కువ సమయం రంగు, డిజైన్ లేదా ధర గురించి ఆలోచిస్తాం. కానీ వాటన్నింటికంటే…
రాజకీయ నాయకుడిగా, సినీ నటుడిగా కోట్లాది మంది అభిమానులను సంపాదించుకున్న ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్…
జామపండు అంటే చాలా మందికి ఇష్టమైన పండు. తక్కువ ధరలో లభించే ఈ పండులో ఆరోగ్యానికి అవసరమైన ఎన్నో పోషకాలు…
తెలుగు బుల్లితెర ప్రేక్షకులకు యాంకర్‌గా, నటిగా ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్న శ్రీముఖి మరోసారి వార్తల్లో నిలిచింది. తన చురుకైన యాంకరింగ్,…