Thammudu Movie: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన సూపర్ హిట్ చిత్రాలలో తమ్ముడు ఒకటి. ఈ సినిమా ఎంతో అద్భుతమైన విజయాన్ని అందుకుంది. ఇక ఈ సినిమాలో హే పిల్లా నీ పేరు లవ్లీ అనే పాట ఎంత ఫేమస్ అయిందో మనకు తెలిసిందే. అయితే ఈ పాట మాత్రమే కాదు ఇందులో నటించిన హీరోయిన్ కూడా ఒక్కసారిగా పాపులర్ అయ్యారు.
ఈ పాటలో నటించిన నటి అదితి గోవిత్రికర్ తెలుగులో ఎంతోమంది అభిమానులను సొంతం చేసుకున్నారు.2002లో ‘సోచ్’ అనే చిత్రంతో బాలీవుడ్‌లో అరంగేట్రం చేసిన అదితి వెండితెరపై మాత్రమే కాకుండా బుల్లితెరపై కూడా తన అదృష్టాన్ని పరీక్షించుకున్నారు అయితే ఇవేవీ తనకు పెద్దగా గుర్తింపు తీసుకురాలేదు కానీ పవన్ కళ్యాణ్ సినిమాలో ఈ పాట మాత్రం తనకు మంచి గుర్తింపు తీసుకువచ్చింది.
ఇలా ఈమె పలు సినిమాలు వెబ్ సిరీస్లో బుల్లితెర సీరియల్స్ లో నటించిన పెద్దగా సక్సెస్ కాలేదు. అయితే ప్రస్తుతం ఈమె ఏం చేస్తుంది ఎక్కడ ఉంది అనే విషయాన్ని వస్తే.. 1998లోనే ఈమె దావూడి బొహ్ర అనే వ్యక్తిని పెళ్ళాడింది. వీరికి ఇద్దరు సంతానం. ఎంత సంతోషంగా సాగిపోతున్న ఈమె వైవాహిక జీవితంలో ఒడిదులుకులు ఎదురయ్యాయి.
ఈ క్రమంలోనే తన భర్తతో ఈమె 2007వ సంవత్సరంలో విడాకులు తీసుకున్నారు. అదితి ప్రస్తుతం తన పిల్లలతో కలిసి ముంబైలోని సోదరి ఆర్జూ గోవిత్రికర్‌తో నివసిస్తోంది. ఇటీవల సైకాలజీలో తన మాస్టర్స్ డిగ్రీ పూర్తి చేసిన అదితి.. ప్రస్తుతం లండన్‌లోని హార్వర్డ్ యూనివర్సిటీలో సైకాలజీలో రెండో మాస్టర్స్ డిగ్రీ చదువుతోంది. కాగా, అదితి గోవిత్రికర్ అటు మోడలింగ్.. ఇటు డాక్టర్ డిగ్రీ.. రెండింటినీ ఎంతో చక్కగా హేండిల్ చేస్తూ తన కెరియర్ లో బిజీ అవుతున్నారు.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…