Celebrity couples : ఎట్టకేలకు ప్రేమ పక్షులు నయనతార విగ్నేష్ శివన్ లు పెళ్లి చేసుకున్నారు. జూన్ 9న అంటే ఈరోజున మహాబలిపురంలో అత్యంత సన్నిహితుల మధ్య పెళ్లి చేసుకున్నారు. వీళ్లు ప్రేమించుకున్నట్లు చాలా రోజులుగా వార్తలు వస్తున్నా ఈ విషయంలో క్లారిటీ లేదు. కానీ గత కొన్ని నెలలుగా ఇద్దరు పెళ్లి చేసుకోవాలని అనుకుంటున్నట్లు వార్తలు వినిపించాయి. ఇక తాజాగా విగ్నేష్ సోషల్ మీడియాద్వారా నయనతార తో పెళ్లి గురించి క్లారిటీ ఇచ్చారు. ఇక వీరి పెళ్లి తోలుత తిరుపతిలో జరుగుతుంది అని అనుకున్నా ఆ తరువాత వివిధ కారణాల వల్ల మహాబలిపురంలో జరిగింది. ఈ పెళ్ళికి రజనీకాంత్, షారుఖ్ ఖాన్ కూడా హాజరయ్యారని సమాచారం. ఇక ఇక్కడ మరో ఇంట్రెస్టింగ్ విషయం నయన తార కన్నా విగ్నేష్ ఒక ఏడాది చిన్నవాడు కావడం.
వాళ్ళ కన్నా చిన్న వాళ్ళను ఇష్టపడుతున్న హీరోయిన్స్….
పురాణాల ప్రకారం రాముడికంటే సీత పెద్దది అని మనకు తెలుసు. కానీ ఇప్పటి సంప్రదాయం ప్రకారం అబ్బాయి కంటే అమ్మాయి వయసు తక్కువ ఉండాలి అని అనుకుంటారు మన పెద్దలు. చాలా వరకు మన సమాజంలో పెళ్లిళ్లు అలానే జరుగుతాయి. కానీ ఎవరో కొంతమంది మాత్రం ఈ సంప్రదాయానికి భిన్నంగా వయసులో తమ కన్నా పెద్ద వయసు ఉన్న అమ్మాయిని పెళ్లి చేసుకుంటారు. ఇక సెలబ్రిటీలు ఈ విషయంలో మినహాయింపు కాదు. సచిన్ నుండి నేటి విగ్నేష్ వరకు అందరూ అలా పెళ్లి చేసుకున్నవారే.
ప్రేమకు వయసు అడ్డు రాదు….
సచిన్ కన్నా అతని భార్య అంజలి ఐదేళ్లు పెద్దది. 1973 లో సచిన్ జన్మిస్తే అంజలి 1967 లో జన్మించారు. అయితే ఏంటి సక్సెస్‌ఫుల్ లైఫ్ ని వాళ్లు ఎంజాయ్ చేస్తున్నారు. ఇక సినిమా వాళ్ళ విషయానికి వస్తే అభిషేక్ బచ్చన్, ఐశ్వర్య రాయ్ లు కూడా ఆ ట్రెండ్ ఫాలో అయిన వాళ్లే. ఐష్ అభిషేక్ కన్నా రెండేళ్లు పెద్దది. బచ్చన్ కుటుంబ బాధ్యతలను చూసుకుంటూ అచితూచి సినిమాలు చేస్తోంది ఐశ్వర్య. ఇక మరో బాలీవుడ్ కపుల్ సైఫ్ అలీ ఖాన్ ఆయన మొదటి భార్య అమ్రీత సింగ్. సైఫ్ కంటే ఆయన మొదటి భార్య 13 ఏళ్ళు పెద్దది. వీరికి ఇద్దరు పిల్లలు సంతానం. ఇక కూతురు సారా అలీ ఖాన్ కూడా ప్రస్తుతం బిజీ హీరోయిన్.
ఇక మన తెలుగు ఇండస్ట్రీ లో కూడా ఇలాంటి జంట ఉంది ఎవరో కాదు సూపర్ స్టార్ మహేష్ బాబు ఆయన వైఫ్ నమ్రత శిరోద్కర్. నమ్రత మహేష్ బాబు కంటే రెండున్నరేళ్లు పెద్దది. జనవరి 22, 1972లో నమ్రత జన్మిస్తే, 9 ఆగష్టు 1975లో మహేష్ బాబు పుట్టారు. పెళ్లి తరువాత సినిమాలకు గుడ్ బై చెప్పింది నమ్రత. సినిమా నిర్మాణ బాధ్యతలను చూసుకుంటూ మహేష్ స్టైలింగ్ విషయం చూసుకుంటోంది. ఇక సుస్మిత తన బాయ్ ఫ్రెండ్ రోహమాన్ షాల్ కంటే 15 ఏళ్ళు పెద్దది. ఇక విరాట్ కోహ్లీ కంటే హీరోయిన్ అనుష్క శర్మ 6 నెలలు పెద్దది. రాజ్ కుంద్ర కంటే శిల్ప శెట్టి వయసులో కొంచెం పెద్దది. ఈ బాటలో బిపాస కూడా చేరిపోయింది. ఇక మరో హాట్ కపుల్ ప్రియాంక చోప్రా నిక్ జోనెస్. ప్రియాంక నిక్ కంటే 10 ఏళ్ళు పెద్దది. 1982 లో ప్రియాంక జన్మిస్తే 1992 లో నిక్ జన్మించాడు. ఇలా వయసులో పెద్దవాళ్లైన లైఫ్‌పార్టనర్ తో విభిన్నంగా పెళ్లి చేసుకున్నా జీవితం మాత్రం సాఫీగా సాగిస్తున్నారు మనం సెలబ్రిటీలు.
ఈ దేశంలో అన్ని భాషల్లోనూ, అన్ని రాష్ట్రాల్లోనూ ఎన్నో పీఠాలు, మఠాలు, దేవస్థానాలు, ధార్మిక మండళ్ళూ, ట్రస్ట్ లు, ధార్మిక…
అద్భుత మంత్ర శక్తులతో, మంత్ర రహస్యాలతో, మంత్ర విశేషాలతో మరీ ముఖ్యంగా మహా బలాలకే మహా బలాన్నిచ్చే పరమాద్భుత నృసింహ…
భారత రూపాయి చరిత్రలో ఎన్నడూ లేని స్థాయిలో పతనమవుతోంది. డాలర్‌తో పోలిస్తే రూపాయి మారకం విలువ రోజురోజుకు దిగజారుతూ ఆల్‌టైం…
చలికాలం వచ్చిందంటే చాలు.. చాలా మందికి ఒక విచిత్రమైన అనుభవం ఎదురవుతుంటుంది. కారు డోర్ తీస్తున్నా, కుర్చీలో కూర్చుంటున్నా, కనీసం…
నేటి ఉరుకుల పరుగుల జీవితంలో మానసిక ప్రశాంతతకు, శారీరక దృఢత్వానికి చాలామంది యోగాను ఆశ్రయిస్తున్నారు. అయితే, యోగా చేసేవారిని తరచుగా…
చేపలు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయనడంలో సందేహం లేదు. అయితే, చేపలను ఏ ఆహారాలతో కలిపి తింటున్నాం అన్నదే అసలు…