ప్రతి ఒక్కరూ జీవితంలో కొంత డబ్బును వెనక్కి తీసుకొని లక్షాధికారి కావాలని అనుకుంటారు. అయితే లక్షాధికారి కావడం అందరికీ సాధ్యం కాదని చాలా మంది భావిస్తుంటారు. అయితే లక్షాధికారి కావాలనే కల ఉన్నవారికి ఈ బ్యాంకు అదిరిపోయే స్కీమ్ ప్రకటించింది. ఈ స్కీమ్ ద్వారా కస్టమర్లు లక్షాధికారిగా మారవచ్చు.
సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా తమ కస్టమర్ల కోసం ప్రత్యేకంగా ఈ స్కీమ్ ను అందుబాటులోకి తెచ్చింది.దీని పేరు సెంట్ ల్యాక్‌పతి. ఈ స్కీమ్‌లో చేరడం వల్ల కస్టమర్లు నెలనెలా ఇన్వెస్ట్మెంట్ చేసుకుంటూ లక్షాధికారి గా మారవచ్చు. ఈ స్కీమ్ ద్వారా సంవత్సరం నుంచి 10 సంవత్సరాల వరకు డబ్బులు ఇన్వెస్ట్ చేసే అవకాశం కల్పించింది. ఈ బ్యాంకు 2016వ సంవత్సరంలోనే ఈ స్కీమ్ ను అందుబాటులోకి తెచ్చింది.
ఎవరైతే ఏడాదిలోపే లక్షాధికారిగా మారాలని భావిస్తారో అలాంటివారు ప్రతి నెల 8 వేల రూపాయలు డిపాజిట్ చేయాల్సి ఉంటుంది. ఇందుకు గాను మీకు 6.65 శాతం వడ్డీ వస్తుంది.అదే కనుక 10 సంవత్సరాలలో లక్షాధికారి గా మారాలంటే నెలకు కేవలం 595 రూపాయలు చెల్లిస్తే చాలు. దీనికి గాను మీకు వడ్డీ 6.45 శాతం లభిస్తుంది.
నెలలో ఎనిమిది వేలు డిపాజిట్ చేయాలంటే కష్టమని భావించేవారు నెలకు 3,900 డిపాజిట్ చేస్తే లక్షాధికారిగా మారవచ్చు. అదే ఐదు సంవత్సరాలలో లక్షాధికారిగా మారాలంటే నెలకు రూ.1411 డిపాజిట్ చేస్తే సరిపోతుంది.నెలకు తక్కువ డబ్బును చెల్లిస్తూ లక్షాధికారిగా మారాలనుకునే వారికి ఈ స్కీమ్ ఎంతో ప్రయోజనకరంగా ఉంటుంది
ప్రకృతిలో జరిగే కొన్ని ఖగోళ అద్భుతాలు మన కళ్లకు నేరుగా కనిపించకపోయినా వాటి ప్రభావాన్ని మాత్రం మనం స్పష్టంగా అనుభవిస్తాం.…
చిన్న వయసులో ఆరోగ్యం గురించి పెద్దగా ఆలోచించని వారు చాలా మంది ఉంటారు. "ఇప్పుడేం కాదు.. తర్వాత చూసుకుందాం", "ఇంకా…
ఈ రోజుల్లో డబ్బు లేకుండా ఏ పని జరగని పరిస్థితి. ఉదయం ఇంటి నుంచి బయటకు అడుగు పెట్టిన దగ్గర…
మన తెలుగు వంటింట్లో కరివేపాకుకు ప్రత్యేక స్థానం ఉంది. పప్పు నుంచి పులుసు వరకు, చట్నీ నుంచి ఫ్రై వరకు…
హైదరాబాద్, జూన్ 20: నిర్మొహమాటంగా నికార్సుగా చెప్పాల్సి వస్తే తెలుగు రాష్ట్రాల్లో నిస్వార్ధ సేవకు నిలువెత్తు అక్షరంగా ప్రతిభతో, ప్రజ్ఞతో,…
వంట చేయడం ఒక కళ. అందులో రుచి రావాలంటే ఉప్పు, కారం, మసాలాలు అన్నీ సరైన మోతాదులో ఉండాలి. అయితే…