అదిరిపోయే బ్యాంక్ స్కీమ్.. కేవలం రూ.595 తో లక్షాధికారి కావచ్చు!

0
69

ప్రతి ఒక్కరూ జీవితంలో కొంత డబ్బును వెనక్కి తీసుకొని లక్షాధికారి కావాలని అనుకుంటారు. అయితే లక్షాధికారి కావడం అందరికీ సాధ్యం కాదని చాలా మంది భావిస్తుంటారు. అయితే లక్షాధికారి కావాలనే కల ఉన్నవారికి ఈ బ్యాంకు అదిరిపోయే స్కీమ్ ప్రకటించింది. ఈ స్కీమ్ ద్వారా కస్టమర్లు లక్షాధికారిగా మారవచ్చు.

సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా తమ కస్టమర్ల కోసం ప్రత్యేకంగా ఈ స్కీమ్ ను అందుబాటులోకి తెచ్చింది.దీని పేరు సెంట్ ల్యాక్‌పతి. ఈ స్కీమ్‌లో చేరడం వల్ల కస్టమర్లు నెలనెలా ఇన్వెస్ట్మెంట్ చేసుకుంటూ లక్షాధికారి గా మారవచ్చు. ఈ స్కీమ్ ద్వారా సంవత్సరం నుంచి 10 సంవత్సరాల వరకు డబ్బులు ఇన్వెస్ట్ చేసే అవకాశం కల్పించింది. ఈ బ్యాంకు 2016వ సంవత్సరంలోనే ఈ స్కీమ్ ను అందుబాటులోకి తెచ్చింది.

ఎవరైతే ఏడాదిలోపే లక్షాధికారిగా మారాలని భావిస్తారో అలాంటివారు ప్రతి నెల 8 వేల రూపాయలు డిపాజిట్ చేయాల్సి ఉంటుంది. ఇందుకు గాను మీకు 6.65 శాతం వడ్డీ వస్తుంది.అదే కనుక 10 సంవత్సరాలలో లక్షాధికారి గా మారాలంటే నెలకు కేవలం 595 రూపాయలు చెల్లిస్తే చాలు. దీనికి గాను మీకు వడ్డీ 6.45 శాతం లభిస్తుంది.

నెలలో ఎనిమిది వేలు డిపాజిట్ చేయాలంటే కష్టమని భావించేవారు నెలకు 3,900 డిపాజిట్ చేస్తే లక్షాధికారిగా మారవచ్చు. అదే ఐదు సంవత్సరాలలో లక్షాధికారిగా మారాలంటే నెలకు రూ.1411 డిపాజిట్ చేస్తే సరిపోతుంది.నెలకు తక్కువ డబ్బును చెల్లిస్తూ లక్షాధికారిగా మారాలనుకునే వారికి ఈ స్కీమ్ ఎంతో ప్రయోజనకరంగా ఉంటుంది

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here