ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ నుంచి ఏపీ, తెలంగాణ విడిపోయిన తరువాత ఏపీకి ఆదాయంతో పోలిస్తే ఖర్చులు పెరిగాయి. 2014లో నవ్యాంధ్రప్రదేశ్ లో అధికారంలోకి వచ్చిన టీడీపీ అప్పులు చేసి ఏపీ అప్పులను మరింత పెంచింది. 2019లో అధికారంలోకి వచ్చిన జగన్ సర్కార్ సైతం ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీల అమలు కోసం అప్పులపైనే ఆధారపడుతోంది. అప్పులు పెరుగుతున్న స్థాయిలో రాష్ట్రానికి ఆదాయం పెరగడం లేదు.
కరోనా వైరస్, లాక్ డౌన్ ఏపీకి ఆర్థిక కష్టాలు మరింతగా పెరిగాయి. ఇలాంటి సమయంలో కేంద్రం జగన్ సర్కార్ కు అదిరిపోయే తీపికబురు చెప్పింది. రాష్ట్రాలకు కేంద్రం రుణాలను తీసుకునే అవకాశం కల్పించింది. కేంద్రం రాష్ట్రాలకు జీఎస్టీ బకాయిలను చెల్లించాల్సి ఉన్నా ఆ బకాయిలను ఇప్పటివరకు చెల్లించని నేపథ్యంలో రుణాలు తీసుకునేందుకు అనుమతులు ఇవ్వడం ద్వారా రాష్ట్రాలకు ప్రయోజనం చేకూర్చాలని భావిస్తోంది.
కేంద్రం జీఎస్టీ పరిహారం కింద రాష్ట్రాలకు 2.35 లక్షల కోట్ల రూపాయలు చెల్లించాల్సి ఉంది. కేంద్రం 20 రాష్ట్రాలు 68 వేల కోట్ల రూపాయలకు పైగా రుణాన్ని ఆర్బీఐ నుంచి తీసుకోవడానికి అనుమతులు ఇచ్చింది. ఈ ఆప్షన్ నచ్చని రాష్ట్రాలు పరిహారం మొత్తం మార్కెట్ నుంచి తీసుకోవాల్సిందిగా సూచనలు చేసింది. ఆర్బీఐ ద్వారా రుణం తీసుకోవవడానికి ఏపీ సుముఖత వ్యక్తం చేసింది.
5,051 కోట్ల రూపాయలు కేంద్రం అనుమతితో రాష్ట్రం అప్పుగా తీసుకోనుంది. కరోనా, లాక్ డౌన్ వల్ల ఆర్థికరమైన కష్టాలను ఎదుర్కొంటున్న ఏపీకి ఇది శుభవార్త అనే చెప్పాలి. కరోనా, లాక్ డౌన్ వల్ల ఏప్రిల్ నుంచి జులై నెలల మధ్య రాష్ట్ర ఆదాయం గణనీయంగా తగ్గిపోయింది. ఇలాంటి సమయంలో కేంద్రం నిర్ణయం ద్వారా ఏపీకి భారీ ఊరట కలిగిందనే చెప్పాలి.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…