Chalaki Chanti : సినిమాల్లో కంటే జబర్దస్త్ ద్వారా బాగా ఫేమస్ అయిన చంటి, చలాకి చంటి గా అందరికీ సుపరిచితుడు. ఈటీవీ జబర్దస్త్ ద్వారా మంచి పేరు తెచ్చుకున్న చంటి ఆ తరువాత ‘నా షో నా ఇష్టం’ ప్రోగ్రామ్ కూడా మంచి సక్సెస్ అందుకుంది. సినిమాల్లోను మంచి అవకాశాలతో కెరీర్ బాగున్నపుడే చంటి జబర్దస్త్ వదిలి వెళ్ళిపోయాడు, అలా రావడం పోవడం వల్ల చంటి గ్రాఫ్ బాగా తగ్గింది జబర్దస్త్ లో. ఇక ఇటీవల మళ్ళీ జబర్దస్త్ లో కనిపిస్తున్న చంటి తాజాగా బిగ్ బాస్ ఆఫర్ వల్ల జబర్దస్త్ వదిలేసాడు. బిగ్ బాస్ సీజన్ 6 కంటెస్టెంట్ గా వెళ్లిన చంటి అక్కడ గేమ్ ఆడలేక ఐదో వారం బయటికి వచ్చేసాడు, ఇక ఇప్పటికి జబర్దస్త్ నుండి మూడు సార్లు బయటికి వెళ్లడం మళ్ళీ జబర్దస్త్ లోకి రావడం చేసిన చంటి అసలు జబర్దస్త్ నుండి అందరూ ఎందుకు వెళ్లిపోతున్నారు అనే విషయంలో గురించి ఆసక్తికర విషయాలను మాట్లాడారు.

సుధీర్ చేసిన ఆరెండు తప్పుల వల్లే జబర్దస్త్ నుండి వెళ్ళిపోయాడు…
జబర్దస్త్ నుండి సుడిగాలి సుధీర్ వెళ్ళిపోయి మళ్ళీ రావాలి అనుకుంటున్నాడంటూ వార్తలు వినిపిస్తున్న నేపధ్యంలో చలాకి చంటి వాటిలో ఉన్న వాస్తవాలను గురించి మాట్లాడారు. జబర్దస్త్ నుండి సుధీర్ వెళ్ళిపోడానికి అతను చేసిన ఏవో రెండు తప్పులే అని అందరూ మాట్లాడుకుంటారు కానీ నాకు వివరాలు తెలియదు, కానీ ఆ తప్పుల వల్లే సుధీర్ ను మల్లెమాల వాళ్ళు తీసేశారని విన్నాను అంటూ చెప్పాడు చంటి. అయితే మళ్ళీ రావాలని సుధీర్ ప్రయత్నిస్తున్నా మల్లెమాల వాళ్ళు ఒప్పుకోవడం లేదనే విషయంలో నాకు తెలియదు, మనం సంస్థతో ఎంత గౌరవంగా ఉన్నామన్న దాని మీదే వాళ్ళు మనతో ప్రవర్తించే తీరు ఉంటుంది అంటూ చెప్పాడు. నేను మూడుసార్లు బయటికి వెళ్లి వచ్చాను. మొదటి సారి కొంచెం బ్రేక్ తీసుకోవాలని వెళ్ళాను. ఒక మూస లో స్కిట్స్ పోతున్నాయి అనిపించింది అందుకే బ్రేక్ తీసుకున్నా కానీ పక్క ఛానెల్స్ లోకి వెళ్ళలేదు.

మళ్ళీ తిరిగి వస్తే పిలుచుకున్నారు, మళ్ళీ సెకండ్ టైం రెమ్యూనరేషన్ విషయంలో గొడవ జరిగి బయటికి వచ్చాను. ఇక మళ్ళీ నా షో నా ఇష్టం చేస్తున్న సమయంలో కూడా జబర్దస్త్ చేయలేదు. మళ్ళీ జబర్దస్త్ కి వచ్చాను ఈసారి రెమ్యూనరేషన్ ముందు కంటే పెంచారు. కానీ మూడు సందర్భలోనూ నేను ఇతర ఛానెల్స్ కి వెళ్ళలేదు. జబర్దస్త్ నుండి పైకి వచ్చాము, అందరూ తప్పులు చేయడం సహజం కానీ దానికి పశ్చత్తాప పడితే ఏ గొడవా ఉండదు అంటూ చంటి అభిప్రాయపడ్డాడు. ఇక జబర్దస్త్ కొత్త డైరెక్టర్స్ గురించి మాట్లాడుతూ అసిస్టెంట్ డైరెక్టర్స్ గా ఉన్నపుడు అన్నా అంటూ మాట్లాడినవాళ్లు డైరెక్టర్స్ అవ్వగమే గౌరవం ఇవ్వాలని కోరుకుంటున్నారు అక్కడే సమస్య అంతే. ఇక రెమ్యూనరేషన్ విషయానికి వస్తే మల్లెమాలలో బాగానే ఇస్తారు, మరీ తక్కువగా ఏమి ఉండదు. అలాగే ఎన్నో విషయాల్లో మనకు కేర్ ఆఫ్ లేనపుడు వెనకుండి నడిపించిన సంస్థ గురించి బయటికి వచ్చి నిందించకూడదు అంటూ అభిప్రాయపడ్డారు.































