Categories: FeaturedMovie News

Chalaki Chanti: నీ టాలెంట్ కు ఇదే ఎక్కువ అని అవమానపరిచారు… మల్లెమాల వారిపై చలాకి చంటి షాకింగ్ కామెంట్స్!

Chalaki Chanti: చలాకి చంటి పరిచయం అవసరం లేని పేరు ఎన్నో సినిమాలలో నటుడుగా నటించిన ఈయన అనంతరం జబర్దస్త్ కార్యక్రమంలో సందడి చేస్తూ పెద్ద ఎత్తున ప్రేక్షకులను ఎంటర్టైన్ చేయడమే కాకుండా ఎంతో మంది అభిమానులను సొంతం చేసుకున్నారు. ఇలా ఇండస్ట్రీలో ఎంతో మంచి పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్న చలాకి చంటి తాజాగా బిగ్ బాస్ 6 లో పాల్గొన్న విషయం తెలిసిందే.

ఇక ఈయన బిగ్ బాస్ కార్యక్రమానికి వచ్చే ముందు ఒక యూట్యూబ్ ఛానల్ ఇంటర్వ్యూలో పాల్గొన్నారు. ఇక ఈ ఇంటర్వ్యూలో భాగంగా చలాకి చంటి మల్లెమాల వారి గురించి పలు ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు.ఇక తాను బిగ్ బాస్ కార్యక్రమం గురించి మాట్లాడుతూ బిగ్ బాస్ కార్యక్రమానికి వెళ్లాలని ఎప్పటినుంచో అనుకుంటున్నాను ఎప్పుడైనా నాగార్జున గారి నోటి నుంచి చంటి అని పిలిపించుకోవాలని ఉంది అంటూ వెల్లడించారు.

ఇక జబర్దస్త్ కార్యక్రమం గురించి మాట్లాడుతూ తనకు జబర్దస్త్ వల్ల పేరు ప్రఖ్యాతలు రాలేదని ఇతర సినిమాలలో నటించి గుర్తింపు సంపాదించుకున్న అనంతరమే జబర్దస్త్ అవకాశం వచ్చిందని తెలిపారు. ఇక జబర్దస్త్ కార్యక్రమంలో తనకు ఇచ్చే రెమ్యూనరేషన్ ఏ మాత్రం సరిపోలేదని, రెమ్యూనరేషన్ పెంచమని ఎంతో రిక్వెస్ట్ గా అడిగితే నీ మొహానికి ఇదే ఎక్కువ అంటూ దారుణంగా అవమానపరిచారని ఈ సందర్భంగా చంటి చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.

Chalaki Chanti: తనకు పొగరు ఈగో అనే ముద్ర వేశారు…

ఇక తాను ఏ విషయం గురించైనా ముక్కుసూటిగా మాట్లాడతానని ఈ క్రమంలోని తనకి పొగరు, ఈగో, కోపిష్టి అనే ముద్ర వేశారని, అయితే ఇవన్నీ కూడా జబర్దస్త్ నుంచి నన్ను బయటకు పంపడానికి కారణమయ్యే అంటూ ఈ సందర్భంగా చలాకి చంటి చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.ఈ విధంగా చంటి కామెంట్ చేయడంతో ఈయన కూడా పూర్తిగా జబర్దస్త్ కార్యక్రమానికి దూరమయ్యారని తెలుస్తోంది. ఇలా జబర్దస్త్ నుంచి వచ్చిన ఈయన బిగ్ బాస్ ద్వారా ఎలా ప్రేక్షకులను సందడి చేస్తారో తెలియాల్సి ఉంది.

lakshana

Lakshana Reddy is Flash News Reporter in Telugudesk.net. Lakshana Reddy covers all Movies and Flash/Breaking News happenings and in Telugu States & Around World.

Recent Posts

పురాణపండ ఎత్తిన మంత్ర పతాకం ‘గౌరీపుత్ర నమస్తేస్తు’ అదిరింది..

హైదరాబాద్, సికింద్రాబాద్ వంటి జంటనగరాల్లోనే కాకుండా విశాఖపట్నం, విజయవాడ, బళ్ళారి, కాకినాడ, గుంటూరు, కర్నూల్, ఒంగోలు, నెల్లూరు, రాజమండ్రి వంటి…

4 days ago

సువాసన ఉన్న ప్యాడ్స్ వాడుతున్నారా?.. ఆరోగ్యానికి ముప్పు అంటున్న వైద్యులు!

ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…

2 months ago

సంజూ శాంసన్‌కు బీసీసీఐ గుడ్‌న్యూస్.. మెగా టోర్నీకి గ్రీన్ సిగ్నల్!

భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…

2 months ago

ప్రభుత్వ విద్యార్థులకు భారీ గుడ్‌న్యూస్.. ఉచిత ల్యాప్‌టాప్‌లు.. ఇకపై స్కూల్‌లోనే AI శిక్షణ..!

తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…

3 months ago

డ్వాక్రా మహిళలకు భారీ ఊరట..సీఎం చంద్రబాబు నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…

3 months ago

క్యాప్‌జెమిని డే కేర్‌లో షాకింగ్ ఘటన.. చిన్నారిపై అమానుష వేధింపులు.. వైరల్ వీడియోలతో కలకలం

బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…

3 months ago