Krishna Vamsi : తెలుగు ఇండస్ట్రీస్ లో విలక్షణమైన సినిమాలు తీసి డైరెక్టర్ గా హిట్లకంటే సమాజానికి ఉపయోగపడే సినిమాలు తీసే డైరెక్టర్ గా పేరు తెచ్చుకున్నాడు కృష్ణ వంశీ. చాలా రోజుల గ్యాప్ తరువాత ‘రంగ మార్తాండ’ సినిమాతో మళ్ళీ రాబోతున్న కృష్ణ వంశీ గులాబీ సినిమాతో మొదలైన సినిమా ప్రయాణం నిన్నేపెళ్లాడుతా, సముద్రం, అంతఃపురం, ఖడ్గం, మురారి వంటి సినిమాలతో ప్రేక్షకులను అలరించాడు. తన సినిమాలలో సామాజిక అంశాలతో పాటు కుటుంబ విలువలను చూపేందుకు కృష్ణ వంశీ ఇష్టపడుతాడు. అయితే ఈ మధ్య కాలంలో ఆశించినంత విజయాలను అందుకోలేని కృష్ణ వంశీ మళ్ళీ ఒక కొత్త కథాంశం తో సినిమా చేయబోతున్నాడు.
రమ్య కృష్ణ డబ్బు నేను తీసుకోలేదు…
చాలా రోజుల తరువాత కృష్ణ వంశీగారు సినిమా డైరెస్ట్ చేయబోతున్నారు. ఇక ఆ సినిమాలో రమ్యకృష్ణ కీలక పాత్రలో నటిస్తోంది. అయితే ఇప్పటికే రమ్యకృష్ణ, కృష్ణ వంశీ ఇద్దరూ విడిపోయారు కలిసి లేరు అంటూ చాలా వార్తలు వినిపించినా వాటిన్నింటికీ చెక్ పెడుతూ ప్రస్తుతం ఇద్దరూ కలిసి ఒక ప్రాజెక్ట్ చేస్తున్నారు. ఇక తాజాగా పాల్గొన్న ఇంటర్వ్యూ లో కృష్ణ వంశీ మాట్లాడుతూ ఇలాంటి రూమర్స్ మీద ఎందుకు స్పందించలేదు అని అడుగగా మనం కూడా ఇతరుల గురించి ఇలాంటివి మాట్లాడుతుంటాం, అది కామన్ అందుకే పెద్దగా స్పందించలేదు.
శ్రీ ఆంజనేయం సినిమా సమయంలో మీకు రమ్య కృష్ణ గారికి విబేధాలు వచ్చాయని టాక్ పై స్పందిస్తూ అలాంటిదేమి లేదు ఆమె డబ్బు నేను ఎపుడు తీసుకోలేదు, ఆమె అమాయకురాలేమీ కాదు నాకు గుడ్డిగా తన డబ్బు ఇవ్వడానికి అంటూ చెప్పారు. ఇక కొడుకు గురించి కృష్ణ వంశీ గారు మాట్లాడారు. తనకి నచ్చినట్టు పని చేయడానికి మేము స్వేచ్చ ఇచ్చాము. సినిమాల్లోకి తాను రావాలని అనుకుంటే రావొచ్చు కానీ మేము తనని ఒత్తిడి చేయడం లేదు. తాను సినిమాల్లోకి రావాలనే ఆలోచన మా ఇద్దరికీ లేదు అంటూ చెప్పారు. వాడు పెద్దయ్యాక వాడికి సినిమాలో పనిచేయాలని అనిపిస్తే వాడి ఇష్టం అంటూ చెప్పారు కృష్ణ వంశీ.
హైదరాబాద్, సికింద్రాబాద్ వంటి జంటనగరాల్లోనే కాకుండా విశాఖపట్నం, విజయవాడ, బళ్ళారి, కాకినాడ, గుంటూరు, కర్నూల్, ఒంగోలు, నెల్లూరు, రాజమండ్రి వంటి…
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…