Chandra Babu: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఇటీవల బ్యాంకర్ల సమావేశంలో పాల్గొన్న సంగతి మనకు తెలిసిందే. అయితే బ్యాంకర్ల కమిటీ సమావేశంలో ఈయన చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారాయి. మన భారత దేశంలో 200 నోట్లు 500 నోట్లను రద్దు చేయాలి అంటూ బాబు తెలిపారు.
ప్రధానమంత్రిగా నరేంద్ర మోడీ అధికారంలోకి వచ్చిన తర్వాత నోట్ల రద్దు జరిగిన సంగతి మనకు తెలిసిందే. అయితే 2000 రూపాయల నోట్లను కూడా వెలుగులోకి తీసుకువచ్చారు కానీ కొద్ది రోజులకే ఆ రెండు వేల నోట్లో కూడా బ్యాన్ చేశారు తాజాగా మరోసారి చంద్రబాబు నాయుడు 200 నోట్లు అలాగే 500 నోట్లను రద్దు చేయాలి అంటూ తెలిపారు..
బ్యాంకులు వంద శాతం డిజిటల్ లావాదేవీలు సాధించాలని, నోట్ల వాడకం పూర్తిగా తగ్గిస్తే అవినీతి తగ్గిపోతుందని బ్యాంకర్లకు సీఎం సూచించారు.ఏపీలో వ్యవసాయ రంగానికి ఊతమిచ్చేలా బ్యాంకులు పనిచేయాలన్నారు సీఎం చంద్రబాబు. కౌలు రైతులకు కూడా రుణాలు సులభంగా అందే పరిస్థితి తీసుకురావాలని తెలిపారు.
వ్యవస్థలు కుదేలయ్యాయి..
ఇలా బ్యాంకర్ల కమిటీ సమావేశంలో భాగంగా ఈయన ఎన్నో విషయాల గురించి వీరితో చర్చలు జరిపారు.గత ప్రభుత్వం అనుసరించిన విధానాల వల్ల అన్ని వ్యవస్థలు కుదేలయ్యాయని.. వాటిని మళ్లీ గాడిన పెట్టేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని ఈ సందర్భంగా చంద్రబాబు నాయుడు చేసిన ఈ వ్యాఖ్యలు సంచలనంగా మారాయి.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…