Featured

Rajamouli: ఆర్ఆర్ఆర్ తర్వాత చరణ్ ప్రాజెక్ట్ సుకుమార్ తో..! ఓపెనింగ్ సీన్ చెబితే.. ఇక అంతే..!

Rajamouli: పుష్ఫ ఇచ్చిన సక్సెస్ తో జోష్ మీదున్నాడు క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్. అభిమానుల నుంచి మిక్స్డ్ టాక్ వచ్చినా… కలెక్షన్ల పరంగా మాత్రం సినిమా దూసుకుపోతోంది. సుకుమార్, ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ కాంబినేషన్ లో రూపొందిన ఈ ప్యాన్ ఇండియా సినిమా హిందీ, తమిళ్ లో కూడా రికార్డ్ స్థాయిలో వసూళ్లను రాబడుతోంది.

Rajamouli: ఆర్ఆర్ఆర్ తర్వాత చరణ్ ప్రాజెక్ట్ సుకుమార్ తో..! ఓపెనింగ్ సీన్ చెబితే.. ఇక అంతే..!

అయితే ఇప్పుడు పుష్ప 2 తరువాత రామ్ చరణ్ తో తీయబోయే సనిమా ఎలా ఉంటుందో అని అందరిలోనూ ఆసక్తి నెలకొంది. రామ్ చరణ్, సుకుమార్ కాంబినేషన్ లో వచ్చిన రంగస్థలం మూవీ తరువాత ఈ క్రేజీ కాంబినేషన్ లో ఎలాంటి సినిమా రాబోతుందో అని అభిమానుల్లో ఆసక్తి నెలకొంది. ఇప్పటికే ఈ ఇద్దరి కాంబినేషన్ లో సినిమా రాబోతోందని వార్తలు కూడా వచ్చాయి. 

Rajamouli: ఆర్ఆర్ఆర్ తర్వాత చరణ్ ప్రాజెక్ట్ సుకుమార్ తో..! ఓపెనింగ్ సీన్ చెబితే.. ఇక అంతే..!

అయితే తాజాగా ఈసినిమా పై స్టార్ డైరెక్టర్ ఎస్ ఎస్ రాజమౌళి క్లారిటీ ఇచ్చారు. ఇటీవల ట్రిపుల్ ఆర్ ప్రమోషన్లలో భాగంగా చరణ్, సుక్కు కాంబినేషన్ లో వస్తున్న చిత్రంపై ఆసక్తికర కామెంట్లు చేశారు జక్కన్న. చరణ్ కు సుకుమార్ ఓపెనింగ్ సీక్వెన్స్ గురించి వినిపించాడని.. కానీ నేను దాని గురించి మాట్లాడనని.. ఒక వేళ మాట్లాడితే సుకుమార్ కు గుండె పోటు వస్తుందని అన్నాడు.

ఆ ఒక్క సీన్ ఎంతో కష్టమైంది.. రాజమౌళి:

అయితే చరణ్ కు చెప్పిన ఈ ఒక్కసీన్ చాలా కష్టమైందని.. అద్భుతంగా ఉంటుందని చెప్పుకొచ్చాడు రాజమౌళి. సుకుమార్, చరణ్ కాంబినేషన్ లో సినిమా ఉందని చెప్పకనే చెప్పాడు జక్కన్న. దీంతో ఫ్యాన్స్ అందరూ ఫుల్ ఖుషీ అవుతున్నారు. మొన్న అల్లు అర్జున్.. తాజాగా రాజమౌళి ఈ సినిమాపై కామెంట్లు చేయడంతో రాబోతున్న ఈసినిమా ఎలా ఉంటుందో అని అభిమానుల్లో ఇప్పటి నుంచే అంచనాలు పెరుగుతున్నాయి. కాగా ప్రస్తుతం శంకర్ డైరెక్షన్ లో, కియారా అధ్వానీ జోడీగా చరణ్ ఓ ప్రాజెక్ట్ చేస్తున్నారు. మరోవైపు పుష్ప 2 షూటింగ్ కూడా త్వరలో జరుగబోతోందని తెలుస్తోంది. ఈరెండు ముగిసిన తర్వాతే వీరిద్దరి కాంబినేషన్లో మూవీ ఉండవచ్చని తెలుస్తోంది.

lakshana

Lakshana Reddy is Flash News Reporter in Telugudesk.net. Lakshana Reddy covers all Movies and Flash/Breaking News happenings and in Telugu States & Around World.

Recent Posts

సువాసన ఉన్న ప్యాడ్స్ వాడుతున్నారా?.. ఆరోగ్యానికి ముప్పు అంటున్న వైద్యులు!

ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…

2 months ago

సంజూ శాంసన్‌కు బీసీసీఐ గుడ్‌న్యూస్.. మెగా టోర్నీకి గ్రీన్ సిగ్నల్!

భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…

2 months ago

ప్రభుత్వ విద్యార్థులకు భారీ గుడ్‌న్యూస్.. ఉచిత ల్యాప్‌టాప్‌లు.. ఇకపై స్కూల్‌లోనే AI శిక్షణ..!

తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…

2 months ago

డ్వాక్రా మహిళలకు భారీ ఊరట..సీఎం చంద్రబాబు నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…

2 months ago

క్యాప్‌జెమిని డే కేర్‌లో షాకింగ్ ఘటన.. చిన్నారిపై అమానుష వేధింపులు.. వైరల్ వీడియోలతో కలకలం

బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…

2 months ago

సోషల్ మీడియా వేధింపులపై డిప్యూటీ సీఎం కీలక నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…

2 months ago