Sukumar-Balakrishna: సుకుమార్ ఇంట్లో బాలయ్య ఫొటో..ఎందుకో తెలుసా.. !
Sukumar-Balakrishna: పుష్ప సినిమా ఇచ్చిన కిక్ తో డైరెక్టర్ సుకుమార్ సంతోషంగా ఉన్నారు. పుష్ప సినిమాకు అభిమానుల నుంచి మిశ్రమ స్పందన వచ్చినప్పటికీ.. బాక్సీఫీస్ వద్ద కలెక్షన్లతో దమ్ము రేపుతోంది పుష్ప మూవీ. దీంతో సుకుమార్ ఇప్పుడు పుష్ప 2 తీసే పనిలో ఉన్నట్లు తెలుస్తోంది. అయితే ఇటీవల బాలకృష్ణ టాక్ షో ’ అన్ స్టాపబుల్‘ కు గెస్ట్ గా వచ్చారు.
సుకుమార్ తో పాటు.. హీరో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, హీరోయిన్ రష్మికా మందన్న కూడా బాలయ్య అన్ స్టాపబుల్ షోకు గెస్ట్ లుగా వచ్చారు. ఇప్పటికే ఆహాలో బాలకృష్ణ హోస్ట్ గా వ్యవహరిస్తున్న ’అన్ స్టాపబుల్ విత్ ఎన్బీకే‘ షో ఆహాలో విజయవంతంగా స్ట్రీమ్ అవుతోంది.
ఇప్పటికే మోహన్ బాబు, శ్రీకాంత్, బోయపాటి శ్రీను, రాజమౌళి లతో షో నిర్వహించిన బాలయ్య.. తాజాగా పుష్ప సినిమా టీంతో టాక్ షో చేశారు. దీంట్లో బాలకృష్ణ, సుకుమాణ మధ్య ఆసక్తికర అంశాలు చర్చకు వచ్చాయి. ఈ షోలో తాను బాలకృష్ణ కు ఎన్నో సూపర్ హిట్ సినిమాలు ఇచ్చానని సంచలన కామెంట్లు చేశారు.
మా ఊర్లో అప్పట్లో రెండే వర్గాలు ఉండేవని ఒకటి బాలకృష్ణ వర్గం కాగా.. మరొకటి చిరంజీవి వర్గం అని అన్నారు. మా ఇంట్లో కూడా ఇలానే ఉండేదని అని చెప్పారు. మా ఇంట్లో మొత్తం నలుగురు అన్నదమ్ములం అని.. అందరి కన్నా చిన్నవాడిని నేనని చెప్పారు. పెద్దన్నయ్య బాలకృష్ణ అభిమాని కాగా.. ఇద్దరు అన్నయ్యలు చిరంజీవి అభిమానులు అని చెప్పారు. ఇంట్లో ఓ వైపు బాలకృష్ణ ఫోటో ఉంటే మరోవైపు చిరంజీవి ఫోటో ఉండేదని.. ఎవరి సినిమా విడుదలైనా.. ఇంట్లో గొడవలు తప్పకపోయేవని చెప్పుకొచ్చారు సుకుమార్. మా పెద్దన్నయ్య మిమల్ని కలిశానంటే చాలా ఆనందంగా ఫీల్ అవుతారని.. ఒక్కసారి నా తరపున పెద్దన్నయ్యకు ఐలవ్యూ చెప్పాలని సుకుమార్ బాలయ్యను కోరారు. తాను చూసిన బాలయ్యబాబు సినిమాలు హిట్ అయ్యాయని అన్నారు. దీంతో బాలకృష్ణ… నాతో సినిమాలు తీయకుండానే హిట్ కొట్టావని చమత్కరించారు.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…