Charmer: పూరి జగన్నాథ్ దర్శకత్వంలో విజయ్ దేవరకొండ హీరోగా నటించిన మొట్టమొదటి పాన్ ఇండియా చిత్రం లైగర్.ఈ సినిమా పాన్ ఇండియా స్థాయిలో విడుదల అయ్యి ఎంతో మంచి విజయాన్ని అందుకుంటుందని అందరూ ఎన్నో అంచనాలు పెట్టుకున్నారు. అయితే ఈ సినిమా ఎన్నో అంచనాల నడుమ విడుదలైనప్పటికీ ఈ సినిమా మాత్రం ఒక్కచోట కూడా పాజిటివ్ టాక్ సంపాదించుకోలేకపోయింది.
ఈ సినిమా విడుదలైన మొదటి షో నుంచి ఈ సినిమాకు పూర్తిగా నెగిటివ్ టాక్ రావడంతో భారీ నష్టాలను ఎదుర్కోవాల్సి వస్తుందని ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి. అయితే ఈ సినిమా నష్టపోవడానికి ఎన్నో కారణాలు ఉన్నాయని అందులో చార్మి అతి నమ్మకం కూడా ఒక కారణమని చెప్పాలి.సాధారణంగా ఒక సినిమాని థియేటర్లో అయినా విడుదల చేయొచ్చు లేదా డిజిటల్ మీడియాలో అయినా విడుదల చేయవచ్చు. అది మేకర్స్ నిర్ణయం మేరకు సినిమాలు విడుదలవుతుంటాయి.
కొన్ని సినిమాలకు డిజిటల్ మీడియా నుంచి మంచి లాభాలు రావడంతో థియేటర్లో సినిమాని విడుదల చేసి రిస్క్ చేయడం కన్నా ఇక్కడే లాభాలు పొందడం మంచిదని భావించి డిజిటల్ మీడియాకు తమ సినిమాని భారీ ధరలకు అమ్ముతుంటారు. కొంతమంది సినిమాలు థియేటర్లో విడుదల చేసి నష్టపోయిన వాళ్ళు ఉంటారు. అయితే అలాంటి నష్టం లైగర్ మేకర్స్ ఎదుర్కొంటున్నారని తెలుస్తోంది.
విజయ్ దేవరకొండ అనన్య పాండే జంటగా పాన్ ఇండియా స్థాయిలో ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిన ఈ సినిమాకు ప్రముఖ ఓటిటి సమస్థ నుంచి ఏకంగా 200 కోట్ల ఆఫర్ వచ్చిందట.అయితే ఈ సినిమా ప్రమోషన్ కార్యక్రమాలలో భాగంగా ఈ విషయాన్ని ఛార్మి తెలియజేస్తూ 200 కోట్లు ఆఫర్ వచ్చినప్పటికీ సినిమాపై విజయ్ దేవరకొండ పై నమ్మకంతో ఈ సినిమా ఓటీటీ ఆఫర్ రిజెక్ట్ చేసామని తెలిపారు.అయితే ఈ సినిమా థియేటర్లో విడుదలయ్యి ఫ్లాప్ టాక్ సొంతం చేసుకోవడంతో కేవలం చార్మి అతి నమ్మకం వల్లే ఈ సినిమా 200 కోట్ల రూపాయలను నష్టపోయింది అంటూ పలువురు నెటిజెన్లు కామెంట్ చేస్తున్నారు. నమ్మకం ఉండాలి కానీ అది నమ్మకం ఉండకూడదు అంటూ మరికొందరు ఈ సినిమా విజయం పై స్పందిస్తూ కామెంట్లు చేస్తున్నారు.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…