Child Actress Rachana: సినిమా ఇండస్ట్రీలో హీరో హీరోయిన్లతో పాటు చైల్డ్ ఆర్టిస్టులకు కూడా ఎంతో మంచి ప్రాధాన్యత ఉంటుంది. ఈ క్రమంలోనే ఎంతోమంది చైల్డ్ ఆర్టిస్టులుగా ఇండస్ట్రీలోకి వచ్చి అనంతరం హీరో హీరోయిన్లుగా కొనసాగడం లేదా క్యారెక్టర్ ఆర్టిస్టులుగా కొనసాగడం జరుగుతూ ఉంటుంది.
ఇలా పలు సినిమాలలో చైల్డ్ ఆర్టిస్టులుగా నటించిన వారు పెద్దయిన తర్వాత వారి ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేయడంతో ఒక్కసారిగా అందరూ ఆశ్చర్యపోతూ ఉంటారు.ఈ క్రమంలోనే మహేష్ బాబు వెంకటేష్ మల్టీ స్టార్ గా నటించిన సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు సినిమా గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. కుటుంబ కథా చిత్రంగా ఎంతో మంది ప్రేక్షకులను ఆకట్టుకున్న ఈ సినిమాలో ఒకే ఒక్క డైలాగ్ తో ఫేమస్ అయ్యారు చైల్డ్ ఆర్టిస్ట్ రచన.
ఇందులో ఈ చిన్నారి గోదావరి యాసలో ఏంటి కూలెక్కలేదా వాటరు అనే డైలాగ్ వేసిన చిన్నారినే తెగ గుర్తొస్తుంది.ఇలా ఒక్క డైలాగుతో ఎంతో ఫేమస్ అయినటువంటి ఈమె ప్రస్తుతం ఏం చేస్తుంది ఎక్కడుంది అనే విషయానికి వస్తే ఈ సినిమా తర్వాత రచన ఏ సినిమాలో కూడా పెద్దగా నటించలేదని తెలుస్తుంది. అయితే ప్రస్తుతం ఈమె మాత్రం సినిమాలకు దూరంగా ఉంటూ ఇద్దరు పిల్లలకు తల్లిగా మారిపోయారు.
ఇలా 2019 వ సంవత్సరంలో పెళ్లి చేసుకుని భర్తతో కలిసి సింగపూర్ లో సెటిల్ అయిన రచన ఇద్దరు పిల్లలకు తల్లి అయ్యారు.ఇలా పెళ్లి చేసుకోవడంతో ఈమె పూర్తిగా ఇండస్ట్రీకి దూరమయ్యారు. ఇండస్ట్రీకి దూరంగా ఉన్నప్పటికీ సోషల్ మీడియాలో మాత్రం చాలా యాక్టివ్ గా ఉంటూ తనకు తన ఫ్యామిలీకి సంబంధించిన విషయాలను అభిమానులతో పంచుకుంటూ సందడి చేస్తున్నారు. ప్రస్తుతం రచన ఫోటోలు చూసిన నేటిజన్స్ ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…