Child Artist Shresta : రౌడీ అల్లుడు, మేజర్ చంద్రకాంత్, సమరసింహా రెడ్డి, హిట్లర్, ముగ్గురు మొనగాళ్లు వంటి సినిమాల్లో నటించిన చైల్డ్ ఆర్టిస్ట్ శ్రేష్ఠ గుర్తుందా.. ముఖ్యంగా సమరసింహా రెడ్డి సినిమాలో బాలయ్య ముగ్గురు చెల్లెల్లలో చిన్న చెల్లి సరస్వతిగా నటించిన అమ్మాయి శ్రేష్ఠ. ఆ సినిమాలో బాలయ్య చెల్లిగా కాళ్ల్లు చచ్చుబడిన అమ్మాయి పాత్రలో నటించిన శ్రేష్ఠ ముఖ్యంగా రైల్వే ట్రాక్ సీన్ లో బాగా నటించింది. అయితే ఆ సినిమాలో నటించిన శ్రేష్ఠ ఆ సినిమా తరువాత మళ్ళీ సినిమాల్లో నటించలేదు. మళ్ళీ చాలా కాలానికి యూట్యూబ్ ఛానెల్ లో ఇంటర్వ్యూలో మెరిసిన ఈ అమ్మాయి తన గురించి వివరించింది.

మంచు మనోజ్ తో పెళ్లి…
తెలుగమ్మాయి శ్రేష్ఠ అప్పటి తరం నటులైన ఎన్టీఆర్, ఏఎన్ఆర్, శోభన్ బాబు, కృష్ణ, కృష్ణం రాజు ఇలా అందరితోనూ బాల నటిగా నటించింది. ఇక చిరంజీవి, బాలకృష్ణ వంటి తరువాత తరం హీరోలతోనూ నటించిన శ్రేష్ఠ తాజాగా పలు ఇంటర్వ్యూలలో పాల్గొంటూ ఆసక్తికర విషయాలను తెలిపారు.

మేజర్ చంద్ర కాంత్ సినిమా సమయంలో మనోజ్ తో తెగ అల్లరి చేసేదాన్ని అంటూ చెప్పిన శ్రేష్ఠ, తను మంచి ఫ్రెండ్ అంటూ స్విమ్మింగ్ క్లాసెస్ ఇద్దరం వెళ్ళేవాళ్ళం అని చెప్పింది. శ్రేష్ఠ చదువుయ్యాక మోహన్ బాబు గారు మనోజ్ తో తనకు పెళ్లి చేయాలనే ప్రపోజల్ ను శ్రేష్ఠ పేరెంట్స్ వద్ద పెట్టారట. అయితే నో చెప్పారట శ్రేష్ఠ పేరెంట్స్. ఇక ఇంటర్వ్యూలో కారణాలను చెప్పడానికి శ్రేష్ఠ ఇష్టపడలేదు.






























