Children’s day special : చిన్నపిల్లలంటేనే కల్లా కపటం తెలియదు. నటించమంటే ఇంక అంతే వారికి ఏమనిపిస్తుందో అది చేస్తారు ఈ అల్లరి పిడుగులు. అలాంటి పిల్లలను పెట్టి సినిమా తీయాలంటే ఖచ్చితంగా సాహసమనే చెప్పాలి. అలా మన దర్శకులు పిల్లలని మెయిన్ లీడ్ గా పెట్టి సినిమాలను తీయడమే కాదు హిట్లు కూడా కొట్టారు. అలా పిల్లతో తెరకెక్కించిన కొన్ని తెలుగు సినిమాలను బాల దినోత్సవం సందర్బంగా తెలుసుకుందాం…
అఖిల్, ఎన్టీఆర్, తరుణ్, మహేష్ అందరూ బాల నటులే…
బాల నటులుగా ఒకప్పుడు నటించిన వాళ్ళు ప్రస్తుతం హీరోలుగా దుమ్ములేపుతున్న సూపర్ స్టార్లు ఉన్నారు. అయితే వారిలో చిన్న వయసులోనే నటించిన హీరో అంటే అఖిల్ అక్కినేని ని చెప్పొచ్చు. అఖిల్ కి ఏడాది వయసు ఉన్నపుడే ‘సిసింద్రీ’ సినిమాలో నటించాడు. సినిమా మొత్తం తన చుట్టే తిరుగుతుంది. ఈ సినిమాకు శివ నాగేశ్వరావు డైరెక్టర్. ఏడాది వయసున్న అఖిల్ తో సినిమా తీసిన డైరెక్టర్ కి హ్యాట్సాఫ్ చెప్పాల్సిందే. ఇక మణిరత్నం అనగానే క్లాసిక్ సినిమాలు గుర్తుకు వస్తాయి, అలాంటి మణిరత్నం చేసిన మ్యాజిక్ ‘అంజలి’ సినిమా. బేబీ శాలిని మెయిన్ పాత్రలో నటించిన ఈ సినిమాలో తరుణ్ కూడా ఉన్నాడు. ఇక ఈ సినిమా ఇప్పటికీ క్లాసిక్ గా మిగిలింది. ఇక జూనియర్ ఎన్టీఆర్ రాముడిగా నటించిన సినిమా ‘బాల రామాయణం’ ఈ సినిమాలో అందరూ చిన్నపిల్లలతో చక్కగా పౌరాణిక సినిమాను తీశారు గుణ శేఖర్.
ఇక హీరో తరుణ్ చిన్నప్పుడే బాల నటుడుగా అదరగొట్టాడు. అందులో ఒక సినిమా తేజ. ఇక పిల్లల అల్లరి అనగానే గుర్తొచ్చే సినిమా ‘లిటిల్ సోల్జర్స్’. ఈ సినిమా ఇప్పటికీ ఎంతో మందికి ఫేవరెట్ సినిమా. ఈ సినిమాను గున్నం గంగారాజు తెరకెక్కించారు. ఇద్దరు అన్నా చెల్లెల్ల చుట్టూనే సినిమా మొత్తం సాగుతుంది. ఇక మహేష్ కూడా బాలనటుడిగా పలు చిత్రల్లో నటించాడు. బాల చంధ్రుడు, కొడుకు దిద్దిన కాపురం వంటి సినిమాల్లో నటించారు. పిల్లల చుట్టూ తిరిగే మరో సినిమా ‘దేవుళ్ళు’, తల్లిదండ్రులను కలపడానికి పిల్లలు పడే తపన ఈ సినిమాలో చూపించారు. ఇక పిల్లలే ప్రధాన పాత్రలుగా ఉన్న సినిమాలు ఇంకా తెలుగులో అనేకం ఉన్నాయి. అందులో పసివాడి ప్రాణం, లవకుశ, బాల భారతం వంటి సినిమాలు ఉన్నాయి.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…