టాలీవుడ్ ఇండస్ట్రీ ప్రేక్షకులకు సింగర్ చిన్మయి గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. ఒక సింగర్ గా, డబ్బింగ్ ఆర్టిస్ట్ గాఎంతో మంచి ప్రేక్షకాదరణ పొందిన చిన్మయి తాజాగా మహిళలపై జరుగుతున్న లైంగిక దాడులకు వ్యతిరేకంగా నిరసిస్తూ మహిళలకు అండగా నిలిచారు. ఈ మీటూ ఉద్యమం ద్వారా చిన్మయి నిత్యం వార్తల్లో నిలిచారు.
సోషల్ మీడియాలో ఎంతో చురుకుగా ఉంటూ మహిళల పట్ల జరిగే దాడులకు వ్యతిరేకిస్తూ ఉంటారు. తాజాగా ఈ సింగర్ గురించి సోషల్ మీడియాలో ఒక వార్త చక్కర్లు కొడుతోంది. నటుడు రాహుల్ రవీంద్రన్ ను పెళ్లి చేసుకున్న చిన్మయి గర్భవతి అని… త్వరలోనే వారు ఓ బిడ్డకు జన్మనివ్వడబోపోతున్నారంటూ సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున ప్రచారం జరిగింది. అయితే తాజాగా చిన్మయి ఈ విషయంపై స్పందించారు.
నటుడు రాహుల్ సోదరుడు రవిచంద్రన్ పెళ్లి ఫోటోలను షేర్ చేసిన రాహుల్ ఈ ఫోటోలో చిన్మయి చీరకట్టులో ఉంది.అయితే చిన్మయి చీర కట్టిన విధానం వల్ల ఆమె కడుపు పెద్దగా అనిపించడంతో అందరూ ప్రెగ్నెంట్ అని ఆమె త్వరలోనే తల్లి కాబోతుందని పెద్ద ఎత్తున వార్తలు షికార్లు చేశాయి.ఈ క్రమంలోనే చిన్మయి స్పందిస్తూ తనపై వచ్చే ఈ వార్తలను ఖండిస్తూ ఇంస్టాగ్రామ్ స్టోరీస్ ద్వారా అసలు విషయాన్ని తెలిపారు.
ఇది మా పెళ్లి ఫోటో.. ఇందులో నేను మడి సార్ ధరించాను. ఈ విధంగా చీర కట్టడం వల్ల నా ఉదరం పెద్దగా ఉంది. ఇలాంటి చీర కట్టును క్యారీ చేయడం తనకు చేత కాలేదని అందువల్లే ఈ విధంగా కనిపిస్తుంది.నేను గర్భవతిని కాదు అని చిన్మయి బేబీ బంప్ అంటూ యూట్యూబ్ ఛానల్స్ తప్పుగా పెట్టిన ఫోటోలను నేను ఈ రోజు చూశాను. వీటితో విసిగిపోయాను. మడిసార్‌తో ఎక్కువగా నడవడంతో చీర వదులుగా అయ్యింది. అయినా నా పర్సనల్ విషయాలను షేర్ చేసుకోవాల్సిన అవసరం నాకు లేదని,ఒకవేళ నాకు పిల్లలు ఉన్న వారిని సోషల్ మీడియా వేదిక పరిచయం చేయనని ఈ సందర్భంగా తనపై తప్పుడు ప్రచారాలు చేస్తున్న వారికి చిన్మయి గట్టిగా చురకలంటించారు .
ఈ దేశంలో అన్ని భాషల్లోనూ, అన్ని రాష్ట్రాల్లోనూ ఎన్నో పీఠాలు, మఠాలు, దేవస్థానాలు, ధార్మిక మండళ్ళూ, ట్రస్ట్ లు, ధార్మిక…
అద్భుత మంత్ర శక్తులతో, మంత్ర రహస్యాలతో, మంత్ర విశేషాలతో మరీ ముఖ్యంగా మహా బలాలకే మహా బలాన్నిచ్చే పరమాద్భుత నృసింహ…
భారత రూపాయి చరిత్రలో ఎన్నడూ లేని స్థాయిలో పతనమవుతోంది. డాలర్‌తో పోలిస్తే రూపాయి మారకం విలువ రోజురోజుకు దిగజారుతూ ఆల్‌టైం…
చలికాలం వచ్చిందంటే చాలు.. చాలా మందికి ఒక విచిత్రమైన అనుభవం ఎదురవుతుంటుంది. కారు డోర్ తీస్తున్నా, కుర్చీలో కూర్చుంటున్నా, కనీసం…
నేటి ఉరుకుల పరుగుల జీవితంలో మానసిక ప్రశాంతతకు, శారీరక దృఢత్వానికి చాలామంది యోగాను ఆశ్రయిస్తున్నారు. అయితే, యోగా చేసేవారిని తరచుగా…
చేపలు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయనడంలో సందేహం లేదు. అయితే, చేపలను ఏ ఆహారాలతో కలిపి తింటున్నాం అన్నదే అసలు…