Raghu Kunche: రఘు కుంచె తెలుగు సినిమా ఇండస్ట్రీలో మ్యూజిక్ డైరెక్టర్ గా పలు సినిమాలకు సంగీత దర్శకత్వం వహిస్తూ ఎంతో మంచి గుర్తింపు పొందారు. అయితే ఈయన సంగీత దర్శకుడి కంటే ముందుగా సింగర్ గా కూడా ఎంతో మంచి పాపులారిటీ సంపాదించుకున్నారు. రఘు కుంచే పాడిన పాటలు అన్నీ కూడా ఎంతో మంచి హిట్ అందుకున్నాయి.
ఇండస్ట్రీలో రఘు కుంచే ఎక్కువగా పూరి జగన్నాథ్ దర్శకత్వంలో తెరకెక్కిన సినిమాలో పాటలు పాడటం ఆయన దర్శకత్వంలో తెరకెక్కిన సినిమాలకు సంగీత దర్శకుడిగా పని చేయడం జరిగింది.ఈ క్రమంలోనే ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న రఘు కుంచె ఇండస్ట్రీలో పూరీతో తనకున్న అనుబంధం గురించి తెలిపారు.
ఈ క్రమంలోనే సంగీత దర్శకుడిగా తనకు దేవుడు చేసిన మనుషులు సినిమా ఎలాంటి పేరు తెచ్చిపెట్టిందో సింగర్ గా కూడా మెగాస్టార్ చిరంజీవి నటించిన మృగరాజు సినిమా మంచి పేరు తెచ్చి పెట్టాయని తెలిపారు. మృగరాజు సినిమా కోసం మణి శర్మ గారు సంగీతం అందించారు. ఇంకా ఈ సినిమాలో పాటలన్నీ కూడా గొప్ప గొప్ప సింగర్లతో పాడించారు.
ఈ సినిమాలో హంగామా హంగామా అనే పాట తన కన్నా ముందుగా కేకే గారు పాడాల్సి ఉంది.అయితే అతను అందుబాటులో లేకపోవడం వల్ల బాచి సినిమాలో నేను పాడిన పాటను మెగాస్టార్ చిరంజీవి గారికి వినిపించడంతో మెగాస్టార్ చిరంజీవి గారు ఈ పాటను రఘుతో పాడించమని చెప్పారు. మెగాస్టార్ చెప్పినట్టుగానే ఆ పాట నాతో పాడించారు. అయితే చిరంజీవి గారికి తెలియకుండా తిరిగి ఈ పాటను కేకే గారితో పాడించారు. ఈ విషయం తెలిసి మెగాస్టార్ కి సమాచారం అందించాను. ఆ సమయంలో మెగాస్టార్ స్టూడియోకు వచ్చి కోపం ఆపుకోలేక అందరి పై గట్టి గట్టిగా అరిచారు. మెగాస్టార్ ఇలా అరిచేసరికి తిరిగి నేను పాడిన పాటని సినిమాలో పెట్టారు. ఈ పాట కూడా మంచి హిట్ అయిందని తెలిపారు.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…