Chiranjeevi: తాజాగా హర్యానా గవర్నర్ మాజీ కేంద్రమంత్రి బండారు దత్తాత్రేయ సమక్షంలో జరిగిన అలయ్ బలయ్ కార్యక్రమంలో మెగాస్టార్ చిరంజీవి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో భాగంగా చిరంజీవి ఎన్నో విషయాలను ముచ్చటించారు. ఈ సందర్భంగా ఈయన మాట్లాడుతూ గతంలో స్టార్ హీరోలు అభిమానుల మధ్య తీవ్రస్థాయిలో పోటీలు ఉండేవి.
ఒక హీరో సినిమా విడుదలై సినిమాకు సంబంధించిన పోస్టర్ గోడలకు అతికిస్తే మరొక హీరో అభిమానులు ఆ పోస్టర్ పై పేడ నీళ్లు చల్లేవారు. తద్వారా హీరోల మధ్య కూడా కాస్త అభిప్రాయ బేధాలు వచ్చేవని చిరంజీవి వెల్లడించారు.అయితే ఓకే ఇండస్ట్రీలో పనిచేసే హీరోల మధ్య ఇలాంటి మనస్పర్ధలు మంచివి కాదన్న ఉద్దేశంతో 80,90లలో హీరోలుగా కొనసాగుతున్న మేము ఇలాంటి వాతావరణం ఉండకూడదని భావించాము.
ఈ క్రమంలోనే అప్పుడు మేమంతా హీరోలుగా ఇండస్ట్రీలో ఎంతో సఖ్యతగా ఉండే వారిమని,ఒక సినిమా విడుదలై సక్సెస్ అయిన తర్వాత అందరి హీరోలను ఆహ్వానించి పెద్ద ఎత్తున పార్టీలు జరుపుకునే వాళ్ళము. ఒకే వేదికపై సందడి చేసే వాళ్ళమని చిరంజీవి అప్పటి విషయాలను గుర్తు చేసుకున్నారు. ఇలా అందరూ కలిసి ఒక చోట ఉండటం వల్ల హీరోల మధ్య ఎలాంటి మనస్పర్ధలు లేకుండా ఉండేవని తెలిపారు.
ఇకపోతే రాత్రి అయితే సీనియర్ నటులు బాలకృష్ణ నాగార్జున వంటి వారితో కలిసి ఒక రెండు పెగ్గులు కూడా వేసేవారిమని ఇలా పెగ్గులు వేసిన తర్వాత వాతావరణం మరింత ఆహ్లాదకరంగా ఉండేదని అప్పటి విషయాలను చిరంజీవి ఈ సందర్భంగా గుర్తు చేసుకున్నారు.ప్రస్తుతం మెగాస్టార్ చేసిన ఈ కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ గా మారడంతో ఎంతో మంది మెగా, నందమూరి అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.
తెలంగాణలోని నల్గొండ జిల్లాకు చెందిన ఏడాది వయసున్న చిన్నారి ఆర్యాన్ష్ ప్రస్తుతం అరుదైన జన్యుపరమైన వ్యాధితో పోరాడుతున్నాడు. చిన్న వయసులోనే…
బెంగళూరులో మూడు నెలల క్రితం చోటుచేసుకున్న ఆరేళ్ల చిన్నారి వెన్నెల మృతి కేసు తాజాగా సంచలన మలుపు తిరిగింది. మొదట…
ఇటీవలి కాలంలో ఆహార భద్రతపై ప్రజల్లో అవగాహన పెరుగుతోంది. ముఖ్యంగా కూరగాయలు, పండ్లలో రసాయనాల వినియోగంపై తరచూ వార్తలు వెలువడుతుండటంతో…
హైదరాబాద్ నగరంలో విషాదకర ఘటన చోటుచేసుకుంది. నారాయణగూడ పోలీస్ స్టేషన్ పరిధిలో నివసిస్తున్న ఇద్దరు అక్కాచెల్లెళ్లు అనారోగ్యానికి గురై చికిత్స…
ప్రపంచ వాతావరణ పరిస్థితులపై మరోసారి ఆందోళన వ్యక్తమవుతోంది. ఇప్పటికే పెరుగుతున్న ఉష్ణోగ్రతలు, వాతావరణ మార్పులు, ప్రకృతి వైపరీత్యాలతో ఇబ్బందులు ఎదుర్కొంటున్న…
తెలుగు బుల్లితెరపై ప్రసారమైన ప్రముఖ డ్యాన్స్ రియాలిటీ షో ‘ఢీ’ ద్వారా ప్రేక్షకులకు పరిచయమైన పండు మాస్టర్, తన డ్యాన్స్…