Chiranjeevi: స్టార్ హీరోగా ఇండస్ట్రీలో ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్నటువంటి వారిలో నటుడు చిరంజీవి ఒకరు. ఈయన ఎలాంటి సినీ బ్యాక్ గ్రౌండ్ లేకుండా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి ఎంతో మందికి స్ఫూర్తిగా నిలిచారు. అయితే చిరంజీవి కూడా కొందరిని స్ఫూర్తిగా తీసుకొని ఇండస్ట్రీలో ఈ స్థాయిలో ఉన్నారని చెప్పాలి.
ఇకపోతే చిరంజీవి ఇటీవల హైదరాబాద్ లో జరిగిన మహానటి సావిత్రి క్లాసికల్ బుక్ లాంచ్ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో భాగంగా సావిత్రి కుమార్తె విజయ చాముండేశ్వరి కూడా పాల్గొన్నారు. అయితే ఈ కార్యక్రమంలో ఈమె మాట్లాడుతూ చేసినటువంటి కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.
నేను ఒకసారి చిరంజీవి గారిని కలవడానికి తన ఇంటికి వెళ్లాను అయితే అప్పటికి ఆయన కాలికి గాయం అయిందని కానీ నేను వచ్చానని తెలిసి చేతికర్ర సహాయంతో పైనుంచి కిందికి వచ్చి తనకు ఎంతో మర్యాద ఇస్తూ మాట్లాడారని తెలిపారు. ఇక ఆయన నాతో మాట్లాడుతూ నేను ప్రతిరోజు ఉదయం లేవగానే సావిత్రి అమ్మ ఫోటోనే చూస్తానని ఇప్పటికి ఆమె ఫోటో నా గదిలో ఉంటుందని చిరంజీవి గారు తెలిపారు.
సావిత్రి ఫోటో…
ఇలా ఆయన నాకు చెప్పడంతో నేను నమ్ముతానో లేదోనని భావించి పైకి వెళ్లి మరి అమ్మగారి ఫోటో తీసుకువచ్చి నాకు చూపించారు. నాకు చిరంజీవి గారిలో నచ్చే విషయం ఇదే ఆయన ఏ విషయమైనా ఉన్నది ఉన్నట్టు మాట్లాడుతారు. ఆయన ఆచరణ మాటతీరు ఆలోచన మూడు ఒకే విధంగా ఉంటాయి. అందుకే ఆయనంటే నాకు చాలా ఇష్టం అందుకే అమ్మగారి ఈ బుక్ లాంచ్ కూడా ఆయన చేతుల మీదుగానే జరగాలి అంటూ విజయ చాముండేశ్వరి చేసిన ఈ కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.
హైదరాబాద్, సికింద్రాబాద్ వంటి జంటనగరాల్లోనే కాకుండా విశాఖపట్నం, విజయవాడ, బళ్ళారి, కాకినాడ, గుంటూరు, కర్నూల్, ఒంగోలు, నెల్లూరు, రాజమండ్రి వంటి…
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…