Kalki 2898 AD: టాలీవుడ్ స్టార్ హీరో ప్రభాస్ ప్రస్తుతం వరుసగా సినిమాలలో నటిస్తున్నతెలిసిందే. ఇటీవల సలార్ మూవితో ప్రేక్షకులను పలకరించిన ప్రభాస్ ప్రస్తుతం కల్కి, రాజాసాబ్, స్పిరిట్, సలార్ 2 వంటి సినిమాలలో నటిస్తూ క్షణం కూడా తీరిక లేకుండా గడుపుతున్నారు ప్రభాస్. ఇకపోతే కల్కి సినిమా త్వరలోనే విడుదల కానున్న విషయం తెలిసిందే. దీంతో మూవీ మేకర్స్ ఈ సినిమాకు సంబంధించిన షూటింగ్ శరవేగంగా జరుపుతున్నారు.
వైజయంతి మూవీస్ బ్యానర్ పై సి అశ్వినీదత్ నిర్మిస్తున్న ఈ చిత్రంలో అమితాబ్ బచ్చన్, కమల్ హాసన్, దీపికా పదుకోన్, దిశా పటాని, పశుపతి తదితరులు ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు.ఇటీవల చిత్ర యూనిట్ ప్రభాస్ అండ్ దిశా పై ఇటలీలో ఒక అందమైన సాంగ్ ని చిత్రీకరించారు. అందుకు సంబంధించిన రెండు మూడు ఫోటోలను చిత్ర నిర్మాతలు చేశారు.
ప్రభాస్ తో సెల్ఫీ
తాజాగా దిశా పటాని ఆ షెడ్యూల్ కి సంబంధించిన మరికొన్ని ఫోటోలను, వీడియోలను షేర్ చేసారు. ఆ పిక్స్ తో ఇటలీలోని అందమైన ల్యాండ్‌స్కెప్స్, బీచ్స్, సిటీస్ కనిపిస్తున్నాయి. ఆ ఫొటోల్లోనే ప్రభాస్ తో దిశా దిగిన ఒక సెల్ఫీ కూడా ఉంది. ప్రస్తుతం సెల్ఫీ ఫోటో నెట్టింట వైరల్ అవుతోంది. ఆ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవ్వడంతో ప్రభాస్ అభిమానులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.
ఇప్పటికే ఈ సినిమాపై భారీగా అంచనాలు నెలకొన్నాయి. మొన్నటికి మొన్న దిశా పటాని ప్రభాస్ తో కలిసి విమానంలో దిగిన ఫోటోని షేర్ చేసిన దిశ తాజాగా మరోసారి ఫోటోలు షేర్ చేయడంతో ప్రభాస్ అభిమానులు ఆమెపై కామెంట్లు వర్షం కురిపిస్తున్నారు. ఇకపోతే ఇప్పటికే కల్కి సినిమాపై భారీగా అంచనాలు నెలకొన్నాయి. ఈ సినిమాలో మే 9న విడుదల చేయాలని ముందుగా ప్రకటించినప్పటికీ, కొన్ని కొన్ని కారణాలవల్ల ఈ సినిమా విడుదల తేదీని వాయిదా వేశారు.
వేసవి కాలంలో బయట నిలిపిన బైక్‌పై కూర్చుంటే సీటు వేడి ఎక్కువగా ఉండటం సాధారణమే. కానీ ఈ వేడి కేవలం…
ఎండబెట్టిన చేపలు, అంటే డ్రై ఫిష్, సాధారణంగా రుచికరమైన వంటకంగా మాత్రమే భావిస్తారు. కానీ పోషకాహార నిపుణుల ప్రకారం ఇవి…
ఆంధ్రప్రదేశ్‌లోని అనంతపురం జిల్లాలో ప్రసిద్ధి చెందిన మురాది ఆంజనేయస్వామి ఆలయంలో హుండీ లెక్కింపు కార్యక్రమం తాజాగా నిర్వహించారు. ఈ సందర్భంగా…
భారత ఉపరాష్ట్రపతి జగదీప్ ధనఖడ్ ఆంధ్రప్రదేశ్ పర్యటనలో భాగంగా శ్రీకాకుళం జిల్లాలోని ప్రసిద్ధ దేవాలయాలను సందర్శించారు. ఈ సందర్భంగా జిల్లా…
తెలంగాణలోని సిద్దిపేట పట్టణం ఆదివారం రాత్రి భక్తి వాతావరణంలో తేలియాడింది. శ్రీ వాసవి కన్యకాపరమేశ్వరి అమ్మవారు రథోత్సవం ఘనంగా నిర్వహించబడగా,…
వైశాఖ మాసంలోని శుక్ల పక్షంలో వచ్చే మోహిని ఏకాదశి హిందూ సంప్రదాయంలో అత్యంత పవిత్రమైన వ్రతాలలో ఒకటిగా భావించబడుతుంది. ఈ…