Ntr: టాలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్ హీరోగా ఎంతో మంచి సక్సెస్ అందుకున్నటువంటి వారిలో ఎన్టీఆర్ ఒకరు. ఈయన ప్రస్తుతం వరుస పాన్ ఇండియా సినిమాలకు కమిట్ అవుతూ కెరియర్ పరంగా ఎంతో బిజీగా ఉన్నారు. ప్రస్తుతం ఎన్టీఆర్ కొరటాల శివ దర్శకత్వంలో దేవర సినిమా షూటింగ్ పనులలో ఎంతో బిజీగా ఉన్న సంగతి మనకు తెలిసిందే.
నిజానికి ఈ సినిమా ఏప్రిల్ 5వ తేదీ ప్రేక్షకుల ముందుకు రావాల్సి ఉండగా షూటింగ్ ఆలస్యం కావడంతో అక్టోబర్ 10వ తేదీ ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమవుతుంది. ఇక ఈ సినిమా కూడా రెండు భాగాలుగా ప్రేక్షకుల ముందుకు రాబోతున్న సంగతి మనకు తెలిసిందే . ఇటీవల ఈ సినిమా షూటింగ్ పనులలో భాగంగా గోవా వెళ్ళినటువంటి చిత్ర బృందం అక్కడ ఆ షెడ్యూల్ చిత్రీకరణ పూర్తి చేసుకుని వచ్చారు.
ఇదిలా ఉండగా తాజాగా ఎన్టీఆర్ కైరతాబాద్ ఆర్టీవో ఆఫీస్ వద్ద కనిపించడంతో ఒకసారిగా ఇందుకు సంబంధించిన ఫోటోలు వైరల్ అయ్యాయి. ఎన్టీఆర్ ఇలా ఆర్టీవో ఆఫీస్ వద్దకు రావడానికి కారణం లేకపోలేదు. ఇటీవల ఈయన కొత్త కారు కొనడంతో ఆ కారు రిజిస్ట్రేషన్ కోసం ఆర్టీవో ఆఫీస్ కి వచ్చారని తెలుస్తుంది. మరి ఈయన కొనుగోలు చేసినటువంటి ఆ కొత్త కారు ఏది దాని ధర ఎంత ఉంటుంది అనే విషయానికి వస్తే…
మెర్సిడెస్ బెంజ్..
ఎన్టీఆర్ కొత్తగా కొనుగోలు చేసినటువంటి కారు Mercedes-Benz Maybach S-Class S 580. మార్కెట్ లో దీని విలువ దాదాపు రూ.2.72 కోట్లు చూపిస్తుంది. కాగా ఎన్టీఆర్ దగ్గర ఇప్పటికే చాలా కార్లు ఉన్నాయి ఇలా ఈయన దగ్గర కోట్ల విలువ చేసే ఖరీదైన కార్లు ఉన్నప్పటికీ మరో కొత్త కారును కొనుగోలు చేయటం విశేషం.
హైదరాబాద్, సికింద్రాబాద్ వంటి జంటనగరాల్లోనే కాకుండా విశాఖపట్నం, విజయవాడ, బళ్ళారి, కాకినాడ, గుంటూరు, కర్నూల్, ఒంగోలు, నెల్లూరు, రాజమండ్రి వంటి…
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…