Featured

Vijay Devarakonda: అవార్డును వేలం వేసిన విజయ్ దేవరకొండ… ఎన్ని లక్షలకు అమ్మారో తెలుసా?

Vijay Devarakonda: ఎలాంటి సినీ బ్యాగ్రౌండ్ లేకుండా ఇండస్ట్రీలోకి అడుగు పెట్టినటువంటి నటుడు విజయ్ దేవరకొండ త్వరలోనే ఫ్యామిలీ స్టార్ అనే సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధంగా ఉన్నారు. ఈ సినిమా ఏప్రిల్ 5వ తేదీ విడుదల కాబోతున్నటువంటి నేపథ్యంలో ప్రమోషన్ కార్యక్రమాలను వేగవంతం చేశారు. ఈ క్రమంలోనే ఒక ఇంటర్వ్యూ సందర్భంగా ఈయన తన అవార్డును వేలం వేసిన విషయాన్ని గుర్తు చేసుకున్నారు.

విజయ్ దేవరకొండ సందీప్ రెడ్డి వంగ దర్శకత్వంలో అర్జున్ రెడ్డి సినిమాలో నటించిన సంగతి మనకు తెలిసిందే. ఈ సినిమాలో ఈయన నటనకు గాను ఏకంగా ఫిలింఫేర్ అవార్డులలో ఉత్తమ నటుడిగా అవార్డు వరించింది. అయితే ఈ అవార్డును ఈయన 2018 వ సంవత్సరంలో అమ్మేశారట. తనకు అవార్డులంటే పెద్దగా ఇష్టం ఉండదని విజయ్ దేవరకొండ పలు సందర్భాలలో వెల్లడించారు.

ఇలా తనకొచ్చిన కొన్ని అవార్డులను అమ్మగా మరికొన్ని ఆఫీసులో ఉన్నాయని మరికొన్ని ఇంట్లో ఉన్నాయని తెలిపారు. అయితే అర్జున్ రెడ్డి సినిమాకు వచ్చినటువంటి ఈ అవార్డును తాను వేలం పాటలో పెట్టానని ఒక ఐదు లక్షలకు అమ్ముడు పోతే పర్లేదు అనుకున్నాను కానీ ఈ అవార్డును ఏకంగా 25 లక్షలకు కొనుగోలు చేశారని ఈయన తెలిపారు.

25 లక్షలు..
ఈ అవార్డు వేలం వేసిన సమయంలో దివి ల్యాబ్స్ కుటుంబానికి చెందినటువంటి శ్యామలాదేవి అనే మహిళ 25 లక్షలకు ఈ అవార్డు కొనుగోలు చేశారు. ఈ స్థాయిలో ఈ అవార్డు వేలంపాటలో పోవడంతో ఓ కార్యక్రమాన్ని నిర్వహించి ఆమెకు అవార్డును అందజేశామని తెలిపారు. అయితే ఈ అవార్డు వేలం పాటలో వచ్చిన 25 లక్షలు సీఎం రిలీఫ్ ఫండ్ కి పంపించానని విజయ్ దేవరకొండ ఈ సందర్భంగా గుర్తు చేసుకున్నారు.

lakshana

Lakshana Reddy is Flash News Reporter in Telugudesk.net. Lakshana Reddy covers all Movies and Flash/Breaking News happenings and in Telugu States & Around World.

Recent Posts

రూ.250 కోట్లు డిమాండ్.. విజయ్-సంగీత విడాకుల కేసు హాట్ టాపిక్

తమిళ సినీ పరిశ్రమలో అగ్ర హీరోగా గుర్తింపు పొందిన విజయ్ వ్యక్తిగత జీవితం ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది. ఆయన భార్య…

3 hours ago

వేసవిలో అమృతం లాంటి పానీయం.. ఈ నేచురల్ డ్రింక్ మీకు కూలింగ్ ఇస్తుంది!

వేసవి కాలంలో శరీరాన్ని చల్లగా ఉంచే సహజ పానీయాలపై ప్రజల్లో ఆసక్తి పెరుగుతోంది. ఈ క్రమంలో సంప్రదాయంగా ఉపయోగించే “బాదం…

3 hours ago

కూతురు పెళ్లిపై కమల్ ఫోకస్.. శృతి హాసన్ మ్యారేజ్ టాక్ వైరల్

సౌత్ సినీ ఇండస్ట్రీలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించిన హీరోయిన్ శృతి హాసన్ మరోసారి వ్యక్తిగత జీవితంతో వార్తల్లో నిలిచింది.…

3 hours ago

తిరుమలలో తమన్నా దర్శనం.. శ్రీవారి ఆశీస్సులు పొందిన స్టార్ హీరోయిన్!

ప్రసిద్ధ సినీ నటి తమన్నాభాటియా తిరుమల శ్రీవారి దర్శనానికి వెళ్లి భక్తిశ్రద్ధలు చాటుకున్నారు. తిరుమల దేవాలయంలోఉదయం వేళలోనే ఆమె స్వామివారిని…

4 hours ago

సబ్‌స్క్రిప్షన్ వివాదంపై అనన్య నాగళ్ల క్లారిటీ.. “అది నా ఉద్దేశ్యం కాదు!”

టాలీవుడ్‌లో తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్న హీరోయిన్ అనన్య నాగళ్ల ఇటీవల సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారింది. ఇన్‌స్టాగ్రామ్‌లో ఆమె…

4 hours ago

శ్రీశైలంలో భక్తుడి అరుదైన కానుక.. వెండి నాగాభరణం సమర్పణ!

తెలంగాణకు చెందిన ఓ భక్తుడు తన భక్తిశ్రద్ధలను ప్రత్యేకంగా చాటుకున్నారు. హైదరాబాద్కు చెందిన ఈ భక్తుడు, ప్రసిద్ధ శైవక్షేత్రం శ్రీశైలం…

4 hours ago