Featured

Chiranjeevi – Venkatesh : అప్పట్లో చిరంజీవి “గ్యాంగ్ లీడర్” చిత్రాన్ని బ్రేక్ చేసిన వెంకటేష్.. కానీ ఆ తర్వాత ఇలా జరిగింది.!!

గ్యాంగ్ లీడర్, విజయ బాపినీడు దర్శకత్వంలో 1991లో మే 9న విడుదలైన తెలుగు సినిమా. చిరంజీవి, విజయశాంతి ఇందులో ప్రధాన పాత్రధారులు. చిరంజీవికి మాస్ ఇమేజ్ పటిష్టం కావడానికి ఈ చిత్ర విజయం చాలా దోహదం చేసింది.

“గ్యాంగ్‌లీడర్” దర్శకత్వం, కథా రచయిత విజయ్ బాపినీడు (కథ, చిత్రానువాదం), పరుచూరి సోదరులు (సంభాషణలు), నిర్మాత మాగంటి రవీంద్రనాధ్ చౌదరి తారాగణం చిరంజీవి, విజయశాంతి, మురళి మోహన్, శరత్ కుమార్, రావుగోపాల్ రావు, నిర్మలమ్మ మొ.వారు.

బప్పీలహరి సంగీత సారధ్యంలో వచ్చిన పాటలు విజయవంతమయ్యాయి. రఘుపతి (మురళీ మోహన్), రాఘవ (శరత్ కుమార్), రాజారాం (చిరంజీవి) ముగ్గురూ అన్నదమ్ములు. కుటుంబంలో రఘుపతి ఒక్కడే ఉద్యోగస్తుడు. కుటుంబాన్నంతా పోషిస్తుంటాడు. రాఘవ ఐ.ఎ.ఎస్ అవడానికి ప్రయత్నిస్తుంటాడు. రాజారాం మాత్రం స్నేహితులతో కలిసి సరదాగా కాలం గడిపేస్తుంటాడు. అనుకోని సంఘటనలు ఎదురై వాటిని ఏవిధంగా ఎదిరించాడు అన్నది మిగతా కథ అంశం.. 1991లో విడుదలైన ఈ చిత్రం ఆ సంవత్సరానికి గాను ఇండస్ట్రీ హిట్ గా నిలిచింది.

ఇకపోతే సురేష్ ప్రొడక్షన్స్, బి.గోపాల్ దర్శకత్వంలో “బొబ్బిలిరాజా” వంటి బ్లాక్ బస్టర్ తర్వాత అంతే దూకుడుతో వెంకటేష్ ముందుకు దూసుకు వచ్చారు. ఈ సారి యాక్షన్ సినిమా కాకుండా పూర్తి విభిన్నమైన కథతో ప్రేక్షకుల్ని మంత్రముగ్ధుల్ని చేశారు. క్రియేటివ్ కమర్షియల్, కె.ఎస్.రామారావు నిర్మాణం, రవిరాజా పినిశెట్టి దర్శకత్వంలో “చంటి” చిత్రం విడుదల అయ్యింది. ఈ సినిమాలో వెంకటేష్, మీనా హీరో హీరోయిన్లుగా నటించారు. ఊరు జమిందారు పాత్రలో నాజర్ ప్రధాన పాత్రను పోషించారు. ఇళయరాజా అందించిన ఎన్నెన్నో అందాలు ఏవేవో రాగాలు.. అనే పాట ప్రేక్షకులను ఉత్సాహంతో ఉరకలెత్తించగా.. పావురానికి పంజరానికి.. అనే పాట ఫ్యామిలీ ప్రేక్షకులను ఆకట్టుకుంది.

ఇళయరాజా అందించిన ఈ సినిమాలోని అన్ని పాటలు సూపర్ డూపర్ హిట్ అయ్యాయి.1991 సంవత్సరానికి గాను 7 కోట్ల షేర్ వసూలు చేసిన “గ్యాంగ్ లీడర్’ చిత్రాన్ని అధిగమిస్తూ.. 9 కోట్ల షేర్ వసూలు చేసి “చంటి” చిత్రం 1992లో ఇండస్ట్రీ హిట్ గా నిలిచింది. కాకపోతే చంటి చిత్రాన్ని అధిగమిస్తూ.. 10 కోట్ల షేర్ వసూలు చేసి “ఘరానా మొగుడు” చిత్రం అదే సంవత్సరం మరో ఇండస్ట్రీహిట్ గా నిలవడం గమనార్హం.

Lavanya Suresh

Lavanya Suresh is Senior News Reporter in Telugudesk.net. Lavanya Suresh covers all Movies and Flash/Breaking News happenings and in Telugu States & Around World.

Recent Posts

సువాసన ఉన్న ప్యాడ్స్ వాడుతున్నారా?.. ఆరోగ్యానికి ముప్పు అంటున్న వైద్యులు!

ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…

2 months ago

సంజూ శాంసన్‌కు బీసీసీఐ గుడ్‌న్యూస్.. మెగా టోర్నీకి గ్రీన్ సిగ్నల్!

భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…

2 months ago

ప్రభుత్వ విద్యార్థులకు భారీ గుడ్‌న్యూస్.. ఉచిత ల్యాప్‌టాప్‌లు.. ఇకపై స్కూల్‌లోనే AI శిక్షణ..!

తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…

2 months ago

డ్వాక్రా మహిళలకు భారీ ఊరట..సీఎం చంద్రబాబు నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…

2 months ago

క్యాప్‌జెమిని డే కేర్‌లో షాకింగ్ ఘటన.. చిన్నారిపై అమానుష వేధింపులు.. వైరల్ వీడియోలతో కలకలం

బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…

2 months ago

సోషల్ మీడియా వేధింపులపై డిప్యూటీ సీఎం కీలక నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…

2 months ago