Anchor Anasuya: భర్త ప్రపంచానికి చాలా అవసరం ..అనసూయ ఎమోషనల్ కామెంట్స్!
Anchor Anasuya: స్మాల్ స్క్రీన్ పై తన గ్లామర్ తో, యాంకరింగ్ తో ప్రేక్షకులను అలరిస్తున్న యాంకర్ అనసూయ, కొద్ది కాలంలోనే మంచి గుర్తింపును సాధించింది. జబర్దస్త్ షోతో తన పాపులారిటీని పెంచుకొని, తద్వారా సినీ పరిశ్రమలోకి అడుగు పెట్టింది. రంగమ్మత్తగా రంగస్థలం సినిమాలో అభిమానుల హృదయాలను కొల్లగొట్టిన ఈ ముద్దు గుమ్మ, గతేడాది రిలీజ్ అయిన పుష్ప సినిమాలోనూ నెగటివ్ పాత్రలో దాక్షాయణిగా నటించి, పాన్ ఇండియా రేంజ్ లో ఇమేజ్ ను సొంతం చేసుకుంది. దీంతో ఇన్ని రోజులూ టీవీ షోలకే పరిమితం అయిన అనసూయకు పాపులారిటీ అమాంతం పెరిగిపోయింది. ఇక అదే ఉత్సాహంతో మరికొన్ని సినిమాలకు సైన్ చేసినట్టు తెలుస్తోంది.
ఇదిలా ఉండగా పలు షోలతో ఇప్పటికే గ్లామర్ అండ్ బ్యూటీఫుల్ యాంకర్ గా పేరు తెచ్చుకున్న అనసూయ ఇటీవల ఓ ప్రముఖ ఛానెల్ లో శ్రీ రామ నవమి సందర్భంగా నిర్వహించిన స్పెషల్ ఈవెంట్ లో మెరిసింది. అందులో భాగంగా కంటెస్టంట్స్ పలు స్కట్స్, డాన్స్ లతో అదరగొట్టినట్టు తెలుస్తోంది.
అంతే కాకుండా అత్తా కోడళ్ళ రిలేషన్ కి సంబంధించి చేసిన ఓ స్కిట్ కి అనసూయా బాగా కనెక్ట్ అయ్యి, ఎమోషన్ అయినట్టుగా కూడా తెలుస్తోంది. అయితే ఈ సందర్భంగా అనసూయ తన భర్త భరద్వాజ్ గురించి చెప్తూ కన్నీటి పర్యంతమైంది. తాను రోజూ తన భర్తతో ప్రేమలో పడుతూ ఉంటానని, తాను చెప్పడం కాదు గానీ, ఆయన లాంటి హస్బెండ్ ఈ ప్రపంచానికి చాలా అవసరం అంటూ ఎమోషనల్ అయ్యింది.
ఎప్పుడూ నవ్విస్తూ, నవ్వుతూ హంగామా సృష్టించే అనసూయ ఇలా కన్నీళ్లు పెట్టుకోవడంతో అక్కడి వాతావరణం అంతా నిశబ్దంగా మారినట్టు తెలుస్తోంది. ఇవే కాకుండా పలు ప్రదర్శనలతో ఈ షో ఈ సారి భారీగానే హిట్ కొట్టేలా నిర్వాహకులు ప్లాన్ చేసినట్టు ఇటీవలే విడుదల చేసిన ప్రోమో చూస్తేనే తెలిసిపోతుంది.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…