Featured

బాక్సాఫీస్ ను ఢీకొట్టిన ఈ మూడు ఆటోల్లో.. ఒకటి మాత్రమే అలా బోల్తా కొట్టింది.?!

బ్లాక్ బస్టర్ “జగదేకవీరుడు అతిలోకసుందరి” తర్వాత రాఘవేంద్రరావు, చిరంజీవి కాంబినేషన్ లో మరొక చిత్రం వచ్చింది. అల్లు అరవింద్, వెంకటేశ్వరరావు నిర్మాణంలో రాఘవేంద్రరావు దర్శకత్వంలో “రౌడీ అల్లుడు” చిత్రం విడుదలైంది.

ఈ సినిమాలో చిరంజీవి, దివ్యభారతి, శోభన హీరో, హీరోయిన్లుగా నటించారు. మెగాస్టార్ చిరంజీవి ఈ చిత్రంలో ద్విపాత్రాభినయం చేశారు. ధనవంతుడిగా కళ్యాణ్ పాత్ర.. ఆటో జానీ గా మరొక పాత్రలో మెగాస్టార్ వెండితెరపై కనిపించారు. ప్రముఖ సంగీత దర్శకుడు బప్పీలహరి అందించిన పాటలు ప్రజాదరణ పొందాయి. ఈ “రౌడీ అల్లుడు” చిత్రం బాక్సాఫీస్ వద్ద ఘన విజయాన్ని నమోదు చేసుకుంది.

“బాషా”1995 లో విడుదలైన తెలుగు అనువాద చిత్రం.సురేష్ కృష్ణ దర్శకత్వంలో వచ్చిన ఈ చిత్రం లో రజనీకాంత్, నగ్మా హీరో, హీరోయిన్స్ గా నటించారు. ఈ చిత్రము సంచలన విజయాన్ని సాధించింది. మాణిక్యం (రజనీకాంత్) ఒక ఆటో డ్రైవర్. పేదవారికి, అవసరార్థులకు సహాయం చేస్తుంటాడు. అనవసర వివాదాలకు, పోట్లాటలకు దూరంగా ఉంటుంటాడు. తన తమ్ముడు, చెల్లిని జీవితంలో పైకి తీసుకురావాలనేది అతని ఆశయం. తమ్ముడు శివ, పోలీస్ శిక్షణను పూర్తిచేసుకుని నియామక ఉత్తర్వులకోసం ఎదురు చూస్తుంటాడు. మాణిక్యానికి ఒక ధనవంతురాలైన అమ్మాయు ప్రియ (నగ్మా) తో పరిచయం అవుతుంది. అతని నిరాండబరత పట్ల ఆమె ఆకర్షితురాలవుతుంది.

మాణిక్యం తమ్ముడు ఇంటర్వ్యూకి హాజరౌతాడు. తన అన్న పేరు మాణిక్యం, అతని జన్మస్థలం బొంబాయి అని విన్న ఉన్నతాధికారులు,మాణిక్యంని ఒకసారి కలవాలని శివని ఆదేశిస్తారు.వారి ఆదేశానుసారం మాణిక్యం పోలీస్ కమీషనర్ కార్యాలయాన్ని సందర్శిస్తాడు. మాణిక్యం బ్యాక్గ్రౌండ్ ఏంటి.. అతను డాన్ గా ఎందుకు మారాడు, ఇప్పుడు ఆటో డ్రైవర్ గా ఎందుకు జీవితాన్ని కొనసాగిస్తున్నాడు అనేది మిగతా కథాంశం.అనువాద చిత్రం అయినప్పటికీ ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద బ్లాక్ బస్టర్ గా నిలిచింది.

“ఆటోడ్రైవర్” 1998లో విడుదలయిన తెలుగు చలనచిత్రం. ఈ సినిమాకు సురేష్ కృష్ణ దర్శకత్వం వహించారు. అక్కినేని నాగార్జున, దీప్తి భట్నాగర్, సిమ్రాన్ ముఖ్య నటీ నటులు. సురేష్ ఈ సినిమాను తమిళంలో “ఒరువన్ అన్” పేరుతో శరత్ కుమార్ కథానాయకుగా పునర్నిర్మించారు. ఈ సినిమాను డి. శివప్రసాద్ రెడ్డి కామాక్షి ఆర్ట్ మూవీస్ పతాకంపై నిర్మించాడు. దేవా సంగీత దర్శకత్వం వహించిన గీతాలు ప్రేక్షకులను ఏమాత్రం అలరించలేకపోయాయి. అయితే ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద బోల్తా కొట్టింది. ఈ చిత్రం తర్వాత నాగార్జున, సిమ్రాన్ కాంబినేషన్లో వచ్చిన “నువ్వు వస్తావని” సినిమా సూపర్ హిట్ కావడం గమనార్హం.

Lavanya Suresh

Lavanya Suresh is Senior News Reporter in Telugudesk.net. Lavanya Suresh covers all Movies and Flash/Breaking News happenings and in Telugu States & Around World.

Recent Posts

సువాసన ఉన్న ప్యాడ్స్ వాడుతున్నారా?.. ఆరోగ్యానికి ముప్పు అంటున్న వైద్యులు!

ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…

2 months ago

సంజూ శాంసన్‌కు బీసీసీఐ గుడ్‌న్యూస్.. మెగా టోర్నీకి గ్రీన్ సిగ్నల్!

భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…

2 months ago

ప్రభుత్వ విద్యార్థులకు భారీ గుడ్‌న్యూస్.. ఉచిత ల్యాప్‌టాప్‌లు.. ఇకపై స్కూల్‌లోనే AI శిక్షణ..!

తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…

2 months ago

డ్వాక్రా మహిళలకు భారీ ఊరట..సీఎం చంద్రబాబు నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…

2 months ago

క్యాప్‌జెమిని డే కేర్‌లో షాకింగ్ ఘటన.. చిన్నారిపై అమానుష వేధింపులు.. వైరల్ వీడియోలతో కలకలం

బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…

2 months ago

సోషల్ మీడియా వేధింపులపై డిప్యూటీ సీఎం కీలక నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…

2 months ago