Rajamouli stunned with NTR’s performance in RRR : ఆర్ఆర్ఆర్ ప్రభంజనం ఇపుడే తగ్గేలా కనిపించడం లేదు. ఎప్పటికప్పుడు విశ్లేషకుల అంచనాలను తలక్రిందులు చేస్తూ దూసుకుపోతోంది. చాలా చోట్ల బ్రేక్ ఈవెన్ కష్టమంటూ వార్తలోచ్చిన అందరిని నోరేళ్ళబెట్టుకునేలా చేసేసింది ఈ జక్కన్న చెక్కిన చిత్రం. అటు బాలీవుడ్ ఇటు టాలీవుడ్ అన్ని చోట్ల నక్కి నక్కి గాదే తొక్కుకుంటూ పోవాలే అన్న చందంగా దుమ్ములేపుతోంది.
ఇక ఎన్టీఆర్, రామ్ చరణ్ కెరీర్ లోనే ది బెస్ట్ పర్ఫార్మెన్స్ గా ఆర్ఆర్ఆర్ లో నటన నిలిచింది. ఇక ఎన్టీఆర్ విషయానికొస్తే ఆర్ఆర్ఆర్ లోని కొమరం భీముడు సాంగ్ లో నటనకు అందరూ ఫిదా అయ్యారు.ప్రతి ఒక్కరూ కంటతడి పెట్టుకునేలా నటించిన ఎన్టీఆర్ తన కెరీర్ లోనే బెస్ట్ పెర్ఫార్మన్స్ ఇచ్చాడు అనుకోవచ్చు. రామ్ చరణ్ నటనకు కూడా మంచి మార్కులు పడ్డాయి. అల్లూరి సీతారామరాజు గా రామ్ చరణ్ నటన అందరినీ కట్టిపడేసింది. అయితే జక్కన్నకు వీళ్ళిద్దరిలో ఎవరి పర్ఫామెన్స్ ఎక్కువ నచ్చిందో తెలుసా..
కొమరం భీముడో నన్ను ఆశ్చర్య పరిచింది…..
ఇక రాజమౌళి ఆ హాలీవుడ్ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఎన్టీఆర్ నటనను ప్రశంసించారు.భీమ్ పాత్రకు తారక్ బెస్ట్ పర్ఫామెన్స్ ఇచ్చారని చెప్పుకొచ్చారు. అయితే ఒక సన్నివేశంలో మాత్రం జూనియర్ ఎన్టీఆర్ తన అంచనాలను మించి అద్భుతంగా నటించాడని జక్కన్న అన్నారు.కొమురం భీముడో సాంగ్ లో తన నటనతో తారక్ నన్ను ఆశ్చర్యపరిచాడని రాజమౌళి తెలిపారు. తన లైఫ్ లో బెస్ట్ ఎపిసోడ్ కొమురం భీముడో సాంగ్ అని మరో సందర్భంలో రాజమౌళి వెల్లడించారు. రామ్ చరణ్ తన నటనతో రామ రాజుగా కట్టిపడేసాడని తెలిపారు.ఆర్ఆర్ఆర్ మూవీలో ఎవరు బెస్ట్ పర్ఫామెన్స్ ఇచ్చారనే ప్రశ్నకు జక్కన్న ఇలా స్పందించారు. ఇక ఇటీవలే ఓలివియా మోర్రీస్ కూడా ఎన్టీఆర్ కొమురం భీముడో సాంగ్ లో నటనకు కన్నీళ్లు పెట్టుకున్నానని తెలిపింది.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…