కొరటాల శివ దర్శకత్వంలో మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న చిత్రం “ఆచార్య”. చిరు 152వ చిత్రం గా రూపుదిద్దుకుంటున్న ఈ చిత్రం యాభై శాతం షూటింగ్ ఇప్పటికే పూర్తయింది. అయితే కరోనా మహమ్మారి కారణంగా ఆచార్య షూటింగ్ వాయిదాపండింది. కరోనా ప్రభావం తగ్గిన తరువాత మే మొదటి వారం నుండి ఈ సినిమా షూటింగ్ తరువాతి షెడ్యూల్ మొదలుకానుంది. అయితే ఈ సినిమాలో ఒక కీలక పాత్రలో సూపర్ స్టార్ మహేష్ బాబు నటించనున్నాడని ఓ వార్త ప్రచారంలో ఉంది. అయితే తాజాగా ఇచ్చిన ఒక ఇంటర్వూలో చిరు స్పందించారు.
మొదటి నుండీ ఈ సినిమాలోని ఆ పాత్రకు కొరటాల చరణ్ నే అనుకున్నారని, మహేష్ ని అసలు అనుకోలేదని స్పష్టం చేసారు. అయితే ఆ పాత్ర కోసం రామ్ చరణ్ ను అనుకున్నామని కానీ చరణ్ ఇంకా డేట్స్ ఇవ్వలేదని చెప్పారు చిరంజీవి. చరణ్ ప్రస్తుతం ఆర్ఆర్ఆర్ చిత్రం షూటింగ్ లో నటిస్తున్నందున ఆచార్య సినిమా కోసం చరణ్ డేట్స్ కావాలంటే రాజమౌళి ఒప్పుకోవాలి. ఈ విషయంపై రాజమౌళి, కొరటాల శివ ఇద్దరు కంప్రమైజ్ అయితేనే ఇది సాధ్యమవుతుందని తెలిపాడు. ఆచార్య సినిమాలో ఆ పాత్ర దాదాపు ఒక ముప్పే నిముషాలు ఉంటుందట. సినిమా రిలీజ్ అయ్యే వరకు లుక్ కూడా బయటకి వెళ్లనివ్వని రాజమౌళి ఇందుకు ఒప్పుకుంటాడా అనేది మిలియన్ డాలర్ల ప్రశ్న. అయితే రాజమౌళి ఈ విషయంలో చరణ్ కి అనుమతి ఇవ్వకపోవచ్చనేది టాలీవుడ్ వర్గాల వాదన.
ఒక వేళ చరణ్ కాకపోతే ఆ స్థానంలో పవర్ స్టార్ పవన్ అయితే కరెక్ట్ గా ఉంటుందని చిత్ర యూనిట్ భావిస్తోందట. సోషల్ కాన్సెప్ట్ సినిమా, అన్న చిరంజీవి అడిగితె పవన్ ఈ సినిమా చేయడానికి ఒప్పుకుంటాడని అనుకుంటున్నారు. ఇదేగనుక జరిగితే పవన్ – చిరుల కాంబినేషన్ కోసం ఎదురు చూస్తున్న మెగా అభిమానులకు పండగే..
హైదరాబాద్, సికింద్రాబాద్ వంటి జంటనగరాల్లోనే కాకుండా విశాఖపట్నం, విజయవాడ, బళ్ళారి, కాకినాడ, గుంటూరు, కర్నూల్, ఒంగోలు, నెల్లూరు, రాజమండ్రి వంటి…
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…