Chittibabu : ఆర్ఆర్ఆర్ సినిమా మార్చి లో విడుదల అయి జనాధరణతో సూపర్ హిట్ అయింది. మన తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా హిందీ లోను సత్తా చాటింది. ఇక హాలీవుడ్ వాళ్లకు సినిమా తెగ నచ్చేసింది. అటు అమెరికన్స్, ఇతర దేశీయులు కూడా సినిమాను ఆధరించారు. చాలా మంది హాలీవుడ్ డైరెక్టర్లు, టెక్నిషియన్స్ సినిమాను రాజమౌళి పనితీరును అలాగే ఎన్టీఆర్, రామ్ చరణ్ ల యాక్టింగ్ ను ప్రశంసించారు. ఇక ఆర్ఆర్ఆర్ సినిమాకు ఆస్కార్ అవార్డు ఏదో ఒక విభాగంలో వస్తుంది అంటూ అందరూ ఆశాభావం వ్యక్తం చేసారు. అయితే ఇప్పుడు ఎన్టీఆర్, రామ్ చరణ్ ఇద్దరిలో ఎవరికి ఆస్కార్ రాబోతోంది అంటూ చర్చ నడుస్తోంది.
ఇద్దరిలో వచ్చే ఛాన్స్ అతడికే…
ఇక ఈ విషయం గురించి సీనియర్ నిర్మాత చిట్టిబాబు మాట్లాడుతూ చిన్న లాజిక్ తో ఎవరికి ఆస్కార్ ఛాన్స్ ఉందో చెప్పేసారు. మొదట ఎన్టీఆర్ సపోర్టింగ్ రోల్ లో ఆస్కార్ బరిలో ఉండొచ్చు అనే వార్త బయటికి వచ్చింది. ఇక దీని తరువాత ఇప్పుడు రామ్ చరణ్ కూడా బరి లో ఉన్నాడంటూ వార్తలు వస్తున్నాయి. ఇక వీటి గురించి మాట్లాడుతూ ఎన్టీఆర్ కు వచ్చే అవకాశం ఉంది. వరైటీ అనే మ్యగజిన్ లో ఎన్టీఆర్ పేరును ప్రస్తావించారు ఆసియా నుండి నామినేట్ అవుతాడు అని అయితే ఇలానే రామ్ చరణ్ వార్త వచ్చింది. కానీ అది ఫేక్, ఫ్యాన్స్ ఏదో ఆనందం కోసం చేసిన పని అంతే, ఇక ఆస్కార్ ఆర్ఆర్ఆర్ సినిమాకు రాదు.
కొత్త క్రియేటివిటీకి మాత్రమే ఆస్కార్ ఇస్తారు కానీ కల్పితానికి, కాపీ సన్నివేశాలకు ఇవ్వరు. ఇక ఎన్టీఆర్ కి కూడా అవార్డు వస్తుందో రాదో తెలియదు కానీ వేదిక మీద నామినేటెడ్ అని పిలిచినపుడు ఆసియా నుండి ఎన్టీఆర్ పేరు రావడం మనకు గర్వంగా అనిపించవచ్చు అంతే కానీ ఇద్దరికీ ఆస్కార్ ఛాన్స్ లేదు. వాళ్లిద్దరూ చాలా స్నేహం తో ఉన్నారు. కానీ ఫ్యాన్స్ మాత్రం మా వాడికి ఆస్కార్ మా వాడికి ఆస్కార్ అంటూ గొడవపడుతున్నారు అంటూ అభిప్రాయపడ్డారు.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…