Bigg Boss6: బిగ్ బాస్ సీజన్ సిక్స్ కార్యక్రమం ప్రసారమవుతూ ఇప్పటికే రెండు వారాలను పూర్తి చేసుకుంది. ఇదివరకు సీజన్లలో మొదటి వారమే బిగ్ బాస్ నుంచి ఒక కంటెస్టెంట్ ఎలిమినేట్ అయ్యే వాళ్ళు అయితే ఈసారి మాత్రం అందుకు భిన్నంగా హౌస్ లోకి వచ్చిన మూడు రోజులకే ఒక వ్యక్తి గురించి సరిగా తెలియకుండా ఎలిమినేట్ చేయడం భావ్యం కాదని భావించిన నిర్వాహకులు మొదటి వారం ఎలిమినేషన్ లేకుండా అందరిని సేవ్ చేశారు.
ఇకపోతే రెండవ వారంలో మాత్రం ఏకంగా డబుల్ ఎలిమినేషన్ ఉండబోతుందని తెలుస్తోంది.మొదటి వారంలో ఏడు మంది కంటెస్టెంట్లు నామినేషన్ లో ఉండగా అందులో అభినయశ్రీ బయటకు వెళ్తుందని పెద్ద ఎత్తున వార్తలు వచ్చాయి. అయితే రెండవ వారంలో కూడా ఆమె తిరిగి నామినేషన్ లో ఉన్నారు. ఈ వారంలో మొత్తం ఎనిమిది మంది కంటెస్టెంట్లు నామినేషన్ లో ఉన్నారు. ఈ 8 మందిలో ఐదుగురు డేంజర్ జోన్ లో ఉన్నారు.
ఆదిరెడ్డి , గీతురాయల్, షానీ, అభినయశ్రీ ఇంకా రాజ్ శేఖర్ డేంజర్ జోన్ లో ఉండగా రాజశేఖర్ కెప్టెన్ కావడంతో ఈయన ఈ వారం సేఫ్ అయినట్టు తెలుస్తోంది. ఇక బేబీ బొమ్మల టాస్కులో అభినయ తన బేబీని కాపాడుకోవడంలో పూర్తిగా విఫలమైంది. ఈమెతో పాటు షానీ కూడా ఆటలో గొప్ప ప్రదర్శన ఇవ్వలేకపోయాడు. వచ్చిన ఐస్ క్రీమ్ ఛాలెంజ్ ని సరిగా టైం కి పెట్టకపోవడం వల్ల ఓటింగ్ లో ఈయన కూడా లీస్ట్ పొజిషన్లో ఉన్నట్టు తెలుస్తోంది.
ఇలా ఇద్దరు కంటెస్టెంట్లకు ఓట్లు చాలా తక్కువగా వచ్చాయని ఈ వారం డబుల్ ఎలిమినేషన్ ఉండటం వల్ల వీరిద్దరూ బయటికి వస్తున్నారని పెద్ద ఎత్తున సోషల్ మీడియాలో వార్తలు వస్తున్నాయి. గత సీజన్లలో మాదిరిగానే ఎలిమినేట్ అయ్యే కంటెస్టెంట్ ల గురించి ముందుగానే సోషల్ మీడియాలో లీక్ అవుతూ ఉంటుంది. ఈ క్రమంలోనే ఈ సీజన్లో కూడా ఈ వారం డబల్ ఎలిమినేషన్ ఉంటుందని వారిలో అభినయ, షానీ ఇద్దరూ ఎలిమినేట్ కానున్నారంటూ వార్తలు వస్తున్నాయి. మరి ఈ వార్తలలో ఎంతవరకు నిజముందో తెలియాలంటే ఇంకా కొన్ని గంటలు మాత్రమే వేచి చూడాలి.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…