Padma Sri Ramachandraiah: సీఎం కేసీఆర్ ను కలిసిన పద్మశ్రీ అవార్డు గ్రహీత..! ఇంటి స్థలానికి రూ. కోటి పురస్కారం..!
Padma Sri Ramachandraiah: ఇటీవల పద్మ అవార్డులు పొందిన వ్యక్తులకు తెలంగాణ ప్రభుత్వం నజరానా ప్రకటించింది. ఇప్పటికే కిన్నెర వాయిద్యకారుడు మొగులయ్యాకు రూ. కోటి ఆర్థిక సాయంతో పాటు ఇంటి నిర్మాణానికి స్థలాన్ని కేటాయించిన సంగతి తెలిసిందే.
తెలంగాణ నుంచి పద్మ అవార్డులకు ఎంపికైన కళాకారులకు నగదుతో పాటు ఇంటి స్థలాలు ఇచ్చి సత్కరిస్తోంది తెలంగాణ ప్రభుత్వం . తాజాగా పద్మశ్రీ పురస్కారానికి ఎంపికైన డోలు వాయిద్య కళాకారుడు సకిని రామచంద్రయ్యకు తెలంగాణ ప్రభుత్వం గౌరవించుకుంది.
అతనికి సొంత జిల్లా కేంద్రం కొత్తగూడెంలో ఇంటిస్థలంలో పాటు నిర్మాణ ఖర్చుకు రూ. కోటి రివార్డ్ను ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రకటించారు. పద్మశ్రీ అవార్డ్ అందుకున్న నేపథ్యంలో మంగళవారం ప్రగతి భవన్ లో సీఎం కేసీఆర్ ను రామచంద్రయ్య మర్యాదపూర్వకంగా కలిశారు.
అంతరించిపోతున్న ఆదివాసీ కళలను బతికిస్తున్నందుకు అవార్డ్ గ్రహీతలను సీఎం కేసీఆర్ అభినందించారు. కళలకు వీరు చేసిన సేవలను కొనియాడారు. పద్మశ్రీ అవార్డ్ పొందడంతో వారికి శుభాకాంక్షలు తెలిపారు. కేసీఆర్ ను కలిసిన సమయంలో రామచంద్రయ్య యోగక్షేమాలు అడిగి తెలుసుకున్నారు. ఇంటిస్థలం, నిర్మాణానికి సంబంధించి సమన్వయం చేసుకోవాల్సిందిగా ప్రభుత్వ విప్ పినపాక ఎమ్మెల్యే రేగాకాంతారావును ఆదేశించారు. గతంలో కూడా పద్మ శ్రీ పొందిన తెలంగాణ గుస్సాడీ నృత్య కళాకారుడు కనకరాజుకు కూడా తన జిల్లా కేంద్రంలో ఇంటి నిర్మాణానికి స్థలాన్ని కేటాయించడంతో పాటు రూ. కోటిని సీఎం ప్రకటించారు. ఇందుకు సంబంధించి సమన్వయం చేసుకోవాల్సిందిగా ఎమ్మెల్యే ఆత్రం సక్కను సీఎం ఆదేశించారు.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…