Flash News: దళితులకు శుభవార్త చెప్పిన సీఎం కేసీఆర్.. ఏంటంటే..!
Flash News: తెలంగాణ సీఎం దళితులకు శుభవార్త చెప్పారు. ఈ ఏడాది 40 వేల కుటుంబాలకు దళిత బంధు ఇస్తామని చెప్పారు. రాష్ట్రంలో మొత్తం 17 లక్షల దళిత కుటుంబాలు ఉన్నాయని.. ప్రతీ ఏటా రెండుమూడు లక్షల మందికి దళిత బంధు ఇస్తామని ప్రకటించారు. మార్చి తరువాత ప్రతీ నియోజకవర్గంలో రెండు వేల మందికి దళిత బంధు ఇస్తామని వెల్లడించారు.
శరీరంలో ఏ భాగం మంచిగా లేకున్నా.. శరీరం మొత్తం బాగున్నట్లు కాదని.. దళితులు కూడా అభివ్రుద్ది చేసుకుందామని అన్నారు సీఎం కేసీఆర్. దళితబంధు పథకం చూసి చాలా మందికి కళ్లు మండుతున్నాయని ప్రతిపక్షాలను విమర్శించారు. ప్రతీ కుటుంబానికి రూ. 10 లక్షలు ఇస్తామని అన్నార.
దళిత బంధులో రూ. 10 లక్షలు ఇవ్వడమే కాకుండా.. మెడికల్ షాపుల్లో, ఫెర్టిలైజర్ షాపుల్లో, ప్రభుత్వ కాంట్రాక్ట్ లో, బార్, వైన్స్ షాపుల్లో రిజర్వేషన్లు పెట్టామని అన్నారు. ఇలా భారత దేశంలో ఏ రాష్ట్రం ఎక్కడా చేయలేదని అన్నారు.
మరోవైపు బీజేపీ ప్రభుత్వం, ప్రధాని మోదీపై తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు. మోదీ ప్రభుత్వం వ్యవసాయ బోర్ల దగ్గర మీటర్లు పెట్టేందుకు ప్రయత్నిస్తుందని… నన్ను చంపినా ఆ పని చేయను అని..ఏం చేసుకుంటావో చేసుకో అని మోదీకి కేసీఆర్ వార్నింగ్ ఇచ్చాడు. బీజేపీ వాళ్లు టీఆర్ఎస్ కార్యకర్తల జోలికి వస్తే నశం చేస్తామంటూ స్ట్రాంగ్ గా వార్నింగ్ ఇచ్చారు. జాతీయ రాజకీయాల్లో కీలక పాత్ర పోషించేందుకు సిద్ధంగా ఉన్నానని.. ఢిల్లీ కోటలు బద్ధలు కొడతా అంటూ.. వ్యాఖ్యానించారు.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…