జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ప్రస్తుతం సినిమాలు, రాజకీయాలు రెండిటిని బ్యాలన్స్ చేస్తున్నారు. మునుపెన్నడూ లేని విధంగా పవన్ ఏకంగా ఒకేసారి 3 చిత్రాలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. పవన్ కళ్యాణ్ కు కమెడియన్ అలీ మంచి మిత్రుడు. ఈ విషయం ఇండస్ట్రీతో పాటు అభిమానులకు కూడా బాగా తెలుసు.
పలు సందర్భాల్లో పవన్.. అలీపై తనకున్న అభిమానాన్ని చాటుకున్నాడు.. పవన్ నటించిన దాదాపు అన్ని చిత్రాల్లో అలీ కనిపిస్తాడు. ఇంతటి స్నేహ సంబంధాలు ఉన్న అలీ, పవన్ మధ్య రాజకీయాల వల్ల మనస్పర్థలు ఏర్పడ్డాయి. గతసార్వత్రిక ఎన్నికల్లో భాగంగా అలీ వైసిపిలో చేరాడు. అప్పటి నుంచి వీరి మధ్య గ్యాప్ ఏర్పడింది. ఆ సమయంలో పవన్ విమర్శలకు అలీ హర్ట్ కావడం జరిగింది. ఆ తర్వాత వీరిద్దరూ కలుసుకున్న సందర్భాలు పెద్దగా లేవు. ఇదిలా వుంటే ఈమధ్యనే ఒక ఇంటర్వ్యూలో అలీ పవన్ కళ్యాణ్ తో నటించిన సినిమాలని ఉద్దేశించి మాట్లాడుతూ పవన్ తో తనకున్న స్నేహం గురించి కూడా తన మనోభావాలను బయట పెట్టాడు. ప్రస్తుతం పవన్ నటిస్తున్న 3 చిత్రాల్లో ఏదో ఒక దానిలో అలీ నటించే అవకాశాలు ఉన్నట్లు కూడా ప్రచారం జరిగుతుంది.
ఇక అసలు విషయానికొస్తే.. టాలీవుడ్ స్టార్ కమెడియన్ ఆలీ.. తన ప్రాణ మిత్రుడు, జనసేన అధినేత పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గురించి ఆసక్తికర విషయాలు చెప్పారు. అవేమిటంటే.. తాను చిరంజీవి కోసం ఆయన ఇంటికి వెళ్తున్నప్పుడు సరిగ్గా అదే సమయానికి పవన్ కళ్యాణ్ అక్కడ ఉండేవారని.. ఆయనతో అలా పరిచయం ఏర్పడిందని, అప్పటికి పవన్ కళ్యాణ్ ఇండస్ట్రీలోకి రాలేదని అన్నారు. చిరంజీవి ఇంట్లో ఆలీని రిసీవ్ చేసుకున్న పవన్ ‘అన్నయ్య ఇప్పుడే వచ్చారు.. మీరు కూర్చోండి.. కాఫీ తాగుతారా, టీ తాగుతారా’ అని సరదాగా కబుర్లు మాట్లాడేవారు. అన్నీ సినిమా కబుర్లే. ఏం సినిమాలు చేస్తున్నారు అని అడిగేవారు. ఆ తరవాత ఆయన ‘అక్కడమ్మాయి ఇక్కడబ్బాయి’ సినిమా చేశారు. ఆ ఒక్క సినిమా తప్ప దాదాపుగా అన్ని సినిమాల్లో నేను నటించాను. ఈమధ్యకాలంలో వచ్చిన ‘అజ్ఞాతవాసి’లో నేను నటించలేదు. ఆయన హీరోగా చేసిన 25 సినిమాల్లో 23 సినిమాల్లో నేను నటించాను. అలా సినిమారంగంలోని జర్నీ వలన మా స్నేహం బలపడింది. పవన్ కళ్యాణ్ గారితో ఆఖరిగా చేసిన సినిమా కాటమరాయుడు’’ అని ఆలీ చెప్పుకొచ్చారు.
బయట జరిగే కార్యక్రమాల్లో ఆలీ కనబడినా, మాట్లాడినా పవన్ కళ్యాణ్ నవ్వడం మొదలుపెడతారు. దీని గురించి ఆలీ ఏం చెప్పారంటే.. ‘‘మేం కొన్ని సైగలు చేసుకుంటూ ఉంటాం. అవి మా ఇద్దరికీ తప్ప ఎవరికీ తెలీవు. నావి కొన్ని ఎక్స్‌ప్రెషన్స్ అంటే ఆయనకి చాలా ఇష్టం. అలాగే, బ్రహ్మానందం గారన్నా ఆయనకు చాలా ఇష్టం. చిరంజీవి గారికి, పవన్ కళ్యాణ్ గారికి బ్రహ్మానందం గారు చాలా క్లోజ్. మెగా ఫ్యామిలీలో ఫంక్షన్ జరిగిందంటే ఆ ఫంక్షన్ కి ఆహ్వానించేవాళ్ళలో బ్రహ్మానందం గారి పేరు, నా పేరు ఖచ్చితంగా ఉంటాయి’’ అని ఆలీ తెలిపారు. అయితే ప్రతి సంవత్సరం చిరంజీవి ఇంటి నుంచి పెద్ద జాడీతో ఆవకాయ పచ్చడి పంపుతారని చెప్పారు. పవన్ కళ్యాణ్ కూడా తన తోటలోని మామిడి పండ్లు పంపేవారని అన్నారు. ప్రస్తుతం రాజకీయాలతో పవన్ బాగా బిజీగా ఉన్నారు కాబట్టి ఈ ఏడాది మామిడి పండ్లు పంపలేదని.. బహుశా వచ్చే ఏడాది పంపుతారేమో అనే ఆశాభావం వ్యక్తం చేసారు ఆలి. చదివారుగా మెగా ఫ్యామిలీతో ఆలీకున్న అనుబంధం గురించి.. మరి పవర్ స్టార్.. కమెడియన్ స్టార్ ల మధ్య స్నేహం రాశి సిమెంటంత స్ట్రాంగ్ కావాలని ఆశిద్దాం.????
హైదరాబాద్, సికింద్రాబాద్ వంటి జంటనగరాల్లోనే కాకుండా విశాఖపట్నం, విజయవాడ, బళ్ళారి, కాకినాడ, గుంటూరు, కర్నూల్, ఒంగోలు, నెల్లూరు, రాజమండ్రి వంటి…
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…