ప్రగతి.. ఈ పేరుకు పెద్దగా పరిచయం అక్కరలేదు.. అమ్మ, వదిన ఇలా చాలా పాత్రలు పోషించి నటిగా మంచిగా గుర్తింపు తెచ్చుకున్నారు ప్రగతి. టాలీవుడ్ లోనే కాకుండా ఇతర భాషల్లో కూడా సపోర్టింగ్ రోల్స్ తో మెప్పించిన ప్రగతి ఎక్కువగా హోమ్లీ పాత్రలు, చీరకట్టు, తెలుగుదనం ఉట్టిపడే పాత్రల్లోనే కనిపించింది.
చేసింది సైడ్ క్యారెక్టర్లు అయినప్పటికీ సోషల్ మీడియాలో స్టార్ హీరోయిన్స్ రేంజ్ లో ఫాలోవర్స్ ని సంపాదించుకుంటున్నారు. తాజాగా ఈమె ఓ తమిళ మాస్ సాంగ్ కి లుంగీ కట్టి వీర మాస్ స్టెప్పులతో డ్యాన్స్ చేసి ప్రేక్షకులను హృదయాలను దోచుకునే ప్రయత్నమే చేసింది. వివరాల్లోకి వెళ్తే.. కరోనా లాక్ డౌన్ పుణ్యమాని సినీ తారలందరూ ఇంట్లోనే వుంటూ రకరకాల వీడియోలతో ప్రేక్షకులను ఆకట్టుకునే ప్రయత్నాలు చేస్తున్నారు. కానీ ఎవరు ఊహించని విధంగా తమిళ్ విజయ్ హీరోగా నటించిన మాస్టర్ సినిమాలోని ఓ సాంగ్ కి లుంగిలో తీన్మార్ స్టెప్పులు వేసి అందర్నీ అలరించింది ప్రగతి.
ఈ సీనియర్ నటీమణి చేసిన డాన్స్ షో సోషల్ మీడియాలో మామూలుగా వైరల్ అవ్వలేదు. దెబ్బకు వీడియో ఇంటర్నెట్ లో కొన్ని వారాల పాటు ట్రెండ్ అయ్యింది. అసలు ఈ రేంజ్ లో ప్రగతికి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉందని ఎవరు నమ్మలేదు. ఈ వీడియోతో ప్రగతి తనలోని అసలు టాలెంట్ ని బయట పెట్టిందనే చెప్పవచ్చు. యువ కధానాయికల కంటే స్టైలిష్ గా తన నడుము అందాలని వయ్యారంగా ఆడించింది. సింపుల్ స్టెప్పులతో హాట్ డ్యాన్స్ చేసిన ప్రగతి వీడియో సంచలనం సృష్టిస్తోంది. లాక్ డౌన్ లో చాలా వరకు ప్రగతి తన ఫిట్నెస్ పై దృష్టి పెట్టింది. అప్పుడప్పుడు ఫిట్నెస్ కి సంబంధించిన చిట్కాలతో ప్రేక్షకులను ని ఎట్రాక్ట్ చేసేది.
ఇక ప్రగతి వయసు 44 ఏళ్లంటే ఎవరు నమ్మలేరు. ఈ వయసులో కూడా ఇంకా తన హోమ్లీ అందంతో ఆకర్షిస్తోంది. వీలైనంత వరకు అందంగా కనిపించడానికే ప్రగతి ఎక్కువగా ఇష్టపడుతుందట. కెరీర్ మొదటి నుంచి ఏ పాత్ర చేసిన ఇష్టంతోనే చేస్తానని ఆ పాత్రలో అందంగా కనిపించడానికి ట్రై చేస్తానని చెబుతోంది. ఇక లాక్ డౌన్ సందర్భంగా ఇప్పటికే సినిమాకి సంబంధించిన షూటింగ్ లు వాయిదా పడిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో సినీనటి ప్రగతి చేసిన వీడియో హాట్ హాట్ గా సంచలనం సృష్టిస్తుంది. మరి మీరూ కూడా ప్రగతి నడుము ఆందాలను చూడాలనుకుంటే ఈ వీడియోను ఒకసారి చూసేయండి..!????
హైదరాబాద్, సికింద్రాబాద్ వంటి జంటనగరాల్లోనే కాకుండా విశాఖపట్నం, విజయవాడ, బళ్ళారి, కాకినాడ, గుంటూరు, కర్నూల్, ఒంగోలు, నెల్లూరు, రాజమండ్రి వంటి…
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…