‘శ్రీ సీతారాముల కల్యాణము చూతము రారండి’ సినిమాతో తెలుగు తెరకి పరిచయమైన హీరో వెంకట్. ఆయన తన తొలి సినిమాతో మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. ఆ సినిమాలో ఆయనను చూసిన ప్రేక్షకులు, హీరోగా బాగా బిజీ అవుతాడని అనుకున్నారు. కాకపోతే అది కొన్ని రోజులు మాత్రమే జరిగింది. ఈ హీరో 1998వ సంవత్సరంలో శ్రీ సీతారాముల కళ్యాణం చూతము రారండి ఈ సినిమాతో వైవిఎస్ చౌదరి దర్శకత్వంలో తెలుగు సినీ ఇండస్ట్రీలోకి అడుగు పెట్టాడు. ఆ తర్వాత సంవత్సరానికి ఒకటి లేదా రెండు సినిమాలు అంటూ 2014 వరకు టాలీవుడ్ ఇండస్ట్రీలో సినిమాలు తీస్తూ వచ్చారు.
హీరో వెంకట్ వెలుగునీడలు, ప్రేమ కోసం, అన్నయ్య, యువరాజు, భలేవాడివి బాసు, శివరామరాజు, ఆనందం, చార్మినార్ ఇలా మొదలగు సినిమాల్లో ఆయన 2014 సంవత్సరం వరకు నటించాడు. ఇకపోతే ఆయన కేవలం హీరోనే మాత్రం కాకుండా టాలీవుడ్ లో సినిమాను నిర్మించాడు. స్వతహాగా ఈయన హీరో కాకముందే కోటీశ్వరుడు హీరో వెంకట్. కాబట్టి ఆయన ఇండస్ట్రీలోకి హీరోగా సక్సెస్ కాకపోయినా సరే చివరికి సినిమాలు నిర్మించడం ద్వారా ఇండస్ట్రీలో కొనసాగవచ్చని ఆయన ధైర్యం చేసి టాలీవుడ్ ఇండస్ట్రీ లోకి వచ్చారు.
అయితే కొన్ని సినీ రాజకీయాలు వల్ల ఆయన అక్కడి పరిస్థితిని తట్టుకోలేక చిన్నగా బయటికి వచ్చాడు. ఈయన ” కొంచెం కొత్తగా ” అనే సినిమాను నిర్మించాడు. ఆ సినిమా పెద్ద కమర్షియల్ హిట్ కాకపోయినా నిర్మాతగా హీరో వెంకట్ లాభపడ్డారు అందులో. నిజంగా హీరో వెంకట్ హీరో కంటే తన వ్యాపారంలో కొన్ని కోట్లకు అధిపతి అయ్యాడు ఆయన. వీరికి ARADA అని ఒక కన్స్ట్రక్షన్ కంపెనీ ఉంది. ఈ కన్స్ట్రక్షన్ సంబంధించి వ్యాపార లావాదేవీలు కేవలం భారత దేశంలోనే కాకుండా ప్రపంచంలోని వివిధ దేశాల్లో వీరి బిజినెస్ జరుగుతోంది. దీనితో ఆయన లావాదేవీలు ఇంచుమించు కొన్నివేల కోట్లలో ఉందన్నమాట.
హైదరాబాద్, సికింద్రాబాద్ వంటి జంటనగరాల్లోనే కాకుండా విశాఖపట్నం, విజయవాడ, బళ్ళారి, కాకినాడ, గుంటూరు, కర్నూల్, ఒంగోలు, నెల్లూరు, రాజమండ్రి వంటి…
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…