Comedian Faima: పటాస్ కార్యక్రమంలో ద్వారా తెలుగు బుల్లితెరకు పరిచయమయ్యారు ఫైమా. అనంతరం జబర్దస్త్ కార్యక్రమంలో ఈమె లేడీ కమెడియన్ గా పెద్ద ఎత్తున సందడి చేస్తూ ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. జబర్దస్త్ కార్యక్రమంలో భాగంగా ఎంతో మంది అభిమానులను సొంతం చేసుకున్నటువంటి ఈమె బిగ్ బాస్ అవకాశాన్ని అందుకున్నారు.
ఇలా బిగ్ బాస్ కార్యక్రమంలో భారీగా ప్రేక్షకులను ఎంటర్టైన్ చేసినటువంటి ఈమె జబర్దస్త్ కార్యక్రమానికి దూరమైనప్పటికీ స్టార్ మా లో ప్రసారమవుతున్నటువంటి పలు కార్యక్రమాల ద్వారా పెద్ద ఎత్తున బుల్లితెర ప్రేక్షకులను సందడి చేస్తున్నారు. ఇకపోతే పటాస్ ప్రవీణ్ ప్రేమలో ఉన్న విషయం మనకు తెలిసిందే. త్వరలోనే పెళ్లి కూడా చేసుకోబోతున్నామని తెలిపారు.
ప్రస్తుతం పైమా రేంజ్ పెరిగి భారీగా డబ్బు సంపాదించడంతో ఏకంగా పటాస్ ప్రవీణ్ కి బ్రేకప్ చెప్పిందంటూ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. మరి నిజంగానే ఫైమా ప్రవీణ్ బ్రేకప్ చెప్పుకున్నారా అసలు ఏం జరిగిందనే విషయానికి వస్తే ఇదంతా కేవలం ఓ సినిమా ప్రమోషన్లలో భాగమేనని తెలుస్తోంది. బేబీ సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చి ఎలాంటి ఆదరణ పొందిందో మనకు తెలిసిందే.
ఈ క్రమంలోని బేబీ సినిమా ప్రమోషన్లలో భాగంగా వీరిద్దరూ కలిసి ఒక స్పూఫ్ వీడియో చేశారు. ఇందులో భాగంగానే పటాస్ ప్రవీణ్ కు ఈమె బ్రేకప్ చెప్పి మరొక వ్యక్తితో పెళ్లికి సిద్ధమైనట్టు ఒక పోస్టర్ విడుదల చేశారు. అయితే ఆ పోస్టర్ లో ఉన్నటువంటి వ్యక్తి ఫేస్ కనపడకుండా దానిని పూర్తిగా ఎడిట్ చేసి పెట్టారని తెలుస్తుంది. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన ఈ పోస్ట్ వైరల్ గా మారడంతో నిజంగానే ఫైమా ప్రవీణ్ బ్రేకప్ చెప్పుకున్నారని అభిమానులు కంగారు పడ్డారు.
భారత రూపాయి చరిత్రలో ఎన్నడూ లేని స్థాయిలో పతనమవుతోంది. డాలర్‌తో పోలిస్తే రూపాయి మారకం విలువ రోజురోజుకు దిగజారుతూ ఆల్‌టైం…
చలికాలం వచ్చిందంటే చాలు.. చాలా మందికి ఒక విచిత్రమైన అనుభవం ఎదురవుతుంటుంది. కారు డోర్ తీస్తున్నా, కుర్చీలో కూర్చుంటున్నా, కనీసం…
నేటి ఉరుకుల పరుగుల జీవితంలో మానసిక ప్రశాంతతకు, శారీరక దృఢత్వానికి చాలామంది యోగాను ఆశ్రయిస్తున్నారు. అయితే, యోగా చేసేవారిని తరచుగా…
చేపలు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయనడంలో సందేహం లేదు. అయితే, చేపలను ఏ ఆహారాలతో కలిపి తింటున్నాం అన్నదే అసలు…
కేంద్రంలోని మోదీ ప్రభుత్వం మరో కీలక నిర్ణయానికి సిద్ధమవుతోంది. ఇప్పటివరకు అమలులో ఉన్న **మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ…
ప్రపంచం అంతా సోషల్ మీడియాకు బానిసైపోతున్న వేళ… ఆస్ట్రేలియా ఒక చారిత్రక నిర్ణయం తీసుకుంది. డిసెంబర్ 10 నుంచి అక్కడ…