Comedian Racha Ravi : జబర్దస్త్ నుండి పేరు తెచ్చుకున్న కమెడియన్స్ లో రచ్చ రవి ఒకరు. అతని బేస్ వాయిస్ కి తన కామెడీ టైమింగ్ చాలా మంది ఫ్యాన్స్ ఉన్నారు. అయితే జబర్దస్త్ నుండి బయటకు వచ్చి రచ్చ రవి సినిమాల్లో కమెడియన్ గా చేస్తున్నాడు. వరుసగా మంచి ఆఫర్స్ అందుకుంటూ సినిమాల్లో బిజీగా ఉన్న రవి ఇటీవలే ‘బలగం’ సినిమాలో ఆటో రాజేష్ గా చాలా బాగా నటించిన విమర్శకుల ప్రశంసలు అందుకున్నాడు. తాజాగా యూట్యూబ్ ఛానెల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడుతూ జబర్దస్త్ గురించి అలాగే తన జీవితం, కుటుంబం గురించి విశేషాలను పంచుకున్నారు.
జబర్దస్త్ వదులుకోడానికి కారణం…
రచ్చ రవి అనే పేరు జబర్దస్త్ నుండే వచ్చింది. మొదటి సారిగా ప్రేక్షకులకు రవిని పరిచయం చేసింది రవికి లైఫ్ ఇచ్చింది జబర్దస్త్ అయినా కూడా రవి జబర్దస్త్ నుండి బయటకు వచ్చేసాడు. ఇక జబర్దస్త్ నుండి బయటికి రావడానికి కారణాలను చెబుతూ జబర్దస్త్ నాకు కన్నతల్లి వంటిది. ఇప్పటికీ నేను మల్లెమాలను వదిలి బయటికి రాలేదు. నాకు ఖాళీగా ఉన్నపుడు వాళ్ళు పిలిస్తే శ్రీదేవి డ్రామా కంపెనీ, జబర్దస్త్ అంటూ వెళ్తూనే ఉన్నాను. నేను సినిమా అవకాశాల కోసం బయటికి వచ్చాను కానీ మల్లెమాల సంస్థను వదిలేయలేదు. సినిమాల్లో నన్ను నేను ప్రమోట్ చేసుకున్నాను మంచి ఆఫర్స్ వస్తున్నాయి. ఇంకా మంచి పాత్రలతో మంచి గుర్తింపు తెచ్చుకోవాలి అందుకోసం కస్టపడుతున్నాను అంటూ చెప్పారు రవి.
ఇక జబర్దస్త్ వదిలి వచ్చాక ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కొనలేదా అనే ప్రశ్నకు ఆర్థిక ఇబ్బందులు ఇప్పటికీ ఉన్నాయి. అలాగని అప్పులు చేయలేను, ఒకరివద్ద చేయి చాపలేను. ఉన్న దాంట్లో కష్టపడటమే నాకు తెలుసు. ఈవెంట్స్ వస్తే చేస్తున్నాను, సినిమాల్లో అవకాశలతో బిజీగా ఉన్నాను, జబర్దస్త్ వల్ల లోన్ తీసుకుని ఇల్లు కొన్నాను, సినిమాల్లో వచ్చిన డబ్బులతో ఆ లోన్ తీర్చాను. నా భార్య బిడ్డలను ఇప్పటివరకు బయటికి ఎక్కడికీ తీసుకెళ్లలేదు. పిల్లలకు సముద్రం చూపించాలి, నా బడ్జెట్ లో వైజాగ్ తీసుకుపోయి సముద్రం చూపిస్తాను అంటూ తన లైఫ్ గురించి వివరించాడు రవి.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…