Featured

India Today Conclave 2023 : మోడీ తో రామ్ చరణ్… ఎన్టీఆర్ ను పక్కన పెట్టి చరణ్ ను పిలవడానికి గల కారణం…!

India Today Conclave 2023 : త్రిబుల్ ఆర్ సినిమా సంచలనం రేపింది. ఒరిజినల్ నేటివ్ సాంగ్ కోటాలో నాటు నాటు పాట ఆస్కార్ అవార్డు కొట్టింది. మొట్టమొదటి సారిగా తెలుగు పాటకు ఆస్కార్ అవార్డు రావడంతో తెలుగు ప్రేక్షకులే కాకుండా ఇండియన్స్ అందరూ గర్వంగా ఫీల్ అవుతున్నారు. వేదిక మీద పాట రచయిత చంద్ర బోస్ అలాగే కంపోజర్ కీరవాణి ఇద్దరూ ఆస్కార్ అందుకున్నారు. ప్రస్తుతం ఎక్కడ చూసినా ఈ సినిమా గురించి చర్చ జరుగుతుండగా ఈ సినిమాలో నటించిన రామ చరణ్, ఎన్టీఆర్ కు ప్రశంసలు అందుతున్నాయి. అయితే సినిమా విడుదల అయినప్పటి నుండి ఈ సినిమాలో చరణ్ నటన బాగుందని కొంతంది ఎన్టీఆర్ నటన హైలైట్ అంటూ కొంతమంది వదిస్తూ వస్తున్నారు. కాగా తాజాగా నేడు ఎన్టీఆర్ ను పక్కన పెట్టి ఇండియా టుడే కంక్లెవ్ కు రామ్ చరణ్ ను ఆహ్వానించడం గురించి చర్చ జరుగుతోంది.

ప్రధాని మోడీ తో కలిసి వేదిక పంచుకోనున్న రామ్ చరణ్…

ప్రధాని మోడీ పాల్గొంటున్న ఈ కార్యక్రమంలో క్రికెట్ దిగ్గజం సచిన్ అలాగే హీరో రామ్ చరణ్ ఒకే వేదికను పంచుకోనున్నారు. ఇది నిజంగా తెలుగు వాళ్లకు గర్వకారణం కానీ ఈ విషయాన్ని పక్కన బెట్టి రామ్ చరణ్ ను పిలిచారు ఎన్టీఆర్ ను మిగిలిన ఆర్ఆర్ఆర్ టీంను పక్కన బెట్టారు అంటూ మాట్లాడటం సబబు కాదని ఒక ప్రముఖ అనలిస్ట్ అభిప్రాయపడ్డారు. ప్రధాని కార్యక్రమాలు నిన్న, ఈరోజు షెడ్యూల్ చేయరు వాటిని ఎపుడో ప్లాన్ చేసుంటారు. ఇక ఎన్టీఆర్ ప్రస్తుతం బిజీగా తన 30వ సినిమా షూటింగ్ కోసం ప్రిపేర్ అవుతున్నాడు.

అయిన ట్రిపుల్ ఆర్ సినిమా తరుపున రామ్ చరణ్ ను పిలుస్తున్నామని వాళ్ళు చెప్పలేదు కదా. అందునా ఆస్కార్ కి ముందే ఈ ప్రోగ్రామ్ షెడ్యూల్ అయింది. అలాంటపుడు ఇలాంటి చర్చ అనవసరం. గతంలో అమిత్ షా ఎన్టీఆర్ ను పిలిచి ఆర్ఆర్ఆర్ లో ఆయన నటన బాగుందని అభినందించడానికి పిలిచారు గౌరవ విందు ఇచ్చారు. ఆ నాడు రామ్ చరణ్, రాజమౌళి లను పిలవలేదు కదా మరి అపుడు రామ్ చరణ్ ను పక్కనపెట్టినట్లా అంటూ విశ్లేషకులు అభిప్రాయపాడుతున్నారు. కాబట్టి ఇలాంటి చర్చల కన్నా మన తెలుగు వ్యక్తి ప్రధానితో వేదిక పంచుకుంటున్నారని గర్వపడటం ఉత్తమం.

Bhargavi

Recent Posts

సువాసన ఉన్న ప్యాడ్స్ వాడుతున్నారా?.. ఆరోగ్యానికి ముప్పు అంటున్న వైద్యులు!

ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…

2 months ago

సంజూ శాంసన్‌కు బీసీసీఐ గుడ్‌న్యూస్.. మెగా టోర్నీకి గ్రీన్ సిగ్నల్!

భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…

2 months ago

ప్రభుత్వ విద్యార్థులకు భారీ గుడ్‌న్యూస్.. ఉచిత ల్యాప్‌టాప్‌లు.. ఇకపై స్కూల్‌లోనే AI శిక్షణ..!

తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…

2 months ago

డ్వాక్రా మహిళలకు భారీ ఊరట..సీఎం చంద్రబాబు నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…

2 months ago

క్యాప్‌జెమిని డే కేర్‌లో షాకింగ్ ఘటన.. చిన్నారిపై అమానుష వేధింపులు.. వైరల్ వీడియోలతో కలకలం

బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…

2 months ago

సోషల్ మీడియా వేధింపులపై డిప్యూటీ సీఎం కీలక నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…

2 months ago